Telugu Gateway
Andhra Pradesh

రఘురామకృష్ణంరాజు కు బీజేపీ షాక్ !

రఘురామకృష్ణంరాజు కు బీజేపీ షాక్ !
X

వైసీపీ కి గత కొన్ని సంవత్సరాలుగా కొరకరాని కొయ్యగా మారిన వ్యక్తి ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు. ఆయనపై లోక్ సభ లో వేటు వేయించేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. కానీ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల వేళ చోటు చేసుకున్న పరిణామం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది. టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ కూడా ఉండాలని బలంగా కోరుకున్న వాళ్లలో రఘురామకృష్ణం రాజు ఒకరు. అయన ఈ దిశగా ఢిల్లీలో ప్రయత్నాలు కూడా చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం పక్కనపెడితే తనకు కూటమి తరపున అది కూడా బీజేపీ నుంచి నరసాపురం లోక్ సభ సీటు వస్తుంది అని రఘురామకృష్ణంరాజు బలంగా నమ్మారు. కానీ బీజేపీ ఆయనకు హ్యాండ్ ఇవ్వటం వైసీపీ లో ఎక్కడలేని సంతోషాన్ని నింపింది. అదే సమయంలో టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరినా కూడా ఆ పార్టీ లో కూటమి నేతల కంటే ఇంకా వైసీపీ మాటే చెల్లుబాటు అవుతుంది అనే సంకేతాలు కనిపిస్తున్నాయని చర్చ సాగుతోంది. ఎందుకంటే వైసీపీ కి వ్యతిరేకంగా గళం విప్పుతూ వచ్చిన ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కు కాకుండా బీజేపీ తరపున నర్సాపురం లోక్ సభ సీటు శ్రీనివాస వర్మ కు కేటాయించారు.

ఈ విషయాన్ని స్వయంగా రఘురామకృష్ణం రాజు ఒక వీడియో లో వెల్లడించారు. తాత్కాలికంగా తనకు పరాజయం ఎదురైంది అయింది..దీన్ని ఒప్పుకుని తీరాలని అన్నారు. అయితే తాజా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానా లేదా అన్నది కొద్దిరోజుల తర్వాత తేలుతుంది అన్నారు. సోము వీర్రాజు ద్వారా జగన్ తనకు సీటు రాకుండా చేయటం లో సక్సెస్ అయ్యారు అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయం అని... తనకు సీటు వచ్చినా రాకపోయినా జగన్ ఓటమి కోసం మాత్రం తన పోరాటం ఆగదన్నారు. అయితే బీజేపీ నర్సాపురం సీటు ను శ్రీనివాస వర్మ కు కేటాయించినా అటు టీడీపీ, జనసేన నుంచి ఓటు ట్రాన్స్ ఫర్ జరగటం అనుమానం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బీజేపీ నే తన వైపు ఉన్నాడు అనుకున్న రఘురామకృష్ణంరాజు కు సీటు విషయం లో హ్యాండ్ ఇచ్చింది..అలాంటిది ఇప్పుడు బీజేపీ కాదన్న అభ్యర్ధికి ఈ తరుణంలో చంద్రబాబు సీటు ఇచ్చే సాహసం చేసే అవకాశం లేదు అనే చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో రఘురామకృష్ణరాజు వ్యవహారం కొత్త చర్చకు కారణం అయింది అనే చెప్పాలి.

Next Story
Share it