Telugu Gateway
Andhra Pradesh

క్వాష్ పిటిషన్ కొట్టివేత..సిఐడి కస్టడీకి అనుమతి

క్వాష్ పిటిషన్ కొట్టివేత..సిఐడి కస్టడీకి అనుమతి
X

ఒకే రోజు రెండు ఎదురుదెబ్బలు. హై కోర్టు లో క్వాష్ పిటిషన్ కొట్టివేత. ఏసీబీ కోర్టు రెండు రోజుల సిఐడి కస్టడీకి అనుమతి. రెండు కోర్టుల్లోనూ పెద్ద పెద్ద సీనియర్ న్యావాదులు వాదించినా ఫలితం లేదు. ఇది తెలుగు దేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి. దీంతో తెలుగు దేశం పార్టీ ఆశలు అన్నీ ఆవిరి అయ్యాయి. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కు హై కోర్ట్ లో షాక్ తగిలింది. అయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కోర్ట్ తోసిపుచ్చింది. ఈ దశలో జోక్యం చేసుకోవటం సరికాదు అని స్పష్టం చేసింది. దర్యాప్తు దశలో దీన్ని అనుమతించలేము అని తెలిపారు. ఇప్పటికే 140 మంది సాక్షులను సీఐడీ విచారించింది.. ఇంత జరిగాక సీఐడీ దర్యాప్తును ఆపమని చెప్పలేం.. దర్యాప్తు సంస్థకు స్వేచ్చ ఇవ్వాలి అని పేర్కొంది. ప్రత్యేక మైన సందర్భాల్లో టాప్ క్వాష్ పిటిషన్ ను అనుమంతించలేము అని ప్రకటించింది. ఈ కేసు విషయంలో పారదర్శకంగా విచారణ జరగాల్సి ఉంది అని తన తీర్పులో ప్రస్తావించింది. దీంతో ఇప్పుడు తెలుగు దేశం పార్టీ తదుపరి కార్యాచరణపై న్యాయనిపుణలతో చర్చలు ప్రారంభించింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం విషయంలో అసలు తన పాత్ర ఏమీ లేదు అని...అంతా నిబంధనల ప్రకారమే జరిగింది అని చంద్రబాబు చెపుతున్నారు.

ఇదే కేసు ను వాదించేందుకు సుప్రీం కోర్ట్ లోని ప్రముఖ లాయర్లు అయిన హరీష్ సాల్వే, సిద్దార్ధ లుద్రా వంటి మహామహులు రంగంలోకి వాదించినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది అనే చెప్పొచ్చు. రెండేళ్ల తర్వాత తన పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చటం, నోటీసు లు ఇవ్వకుండా తనను అరెస్ట్ చేయటం ఏ మాత్రం సరికాదు అని చంద్రబాబు వాదిస్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించి అన్నీ పక్కాగా ఉన్నాయని..ఈ విషయాలను సిఐడి విస్మరించి రాజకీయ దురుద్దేశంతో తనను టార్గెట్ చేసింది అన్నది చంద్రబాబు వాదన. అదే సమయంలో అరెస్ట్ కు ముందు నిబంధనల ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదు అని...అదే సమయంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా తనకు ఈ స్కాం కు సంబంధించి నిధులు అందినట్లు సిఐడి నిరూపించలేక పోయింది అని చెపుతున్నారు. అయినా కూడా హై కోర్ట్ సిఐడి వాదనల వైపు మొగ్గు చూపి చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. ఆరోపణలకు ఆధారాలు లేకుండా రిమాండ్ కు పంపటం సరికాదు అని చెపుతూ...ఇదే కారణంతో హై కోర్ట్ లో క్వాష్ పిటిషన్ వేశారు. ఇక్కడ చుక్కెదురు కావటంతో ఇదే అంశంపై టీడీపీ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించే దిశగా చర్యలు ప్రారంభించింది.

Next Story
Share it