Telugu Gateway
Andhra Pradesh

జగన్ కు నిజంగా ఇది పెద్ద షాకే!

జగన్ కు నిజంగా ఇది పెద్ద షాకే!
X

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆ రాష్ట్ర ప్రజలకు స్వయంప్రకటిత అన్న. ఆయనే ప్రతి పధకానికి తన పేరు తగిలించుకుని ప్రచారం చేసుకుంటున్నారు. ప్రతి యాడ్ లోనే జగనన్న..జగనన్న అంటూ యాడ్స్ కనిపిస్తాయి. కానీ సీఎం జగన్ తన సొంత చెల్లి విషయంలో వ్యవహరించిన తీరు మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో , వరంగల్ జిల్లాలో ఆమెతో వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్ లో వై ఎస్ షర్మిలను కార్ లో ఉంచి మరి క్రేన్ తో ఆమె కార్ ను ఎస్ ఆర్ నగర్ స్టేషన్ కు తరలించారు.ఆ తర్వాత కేసు పెట్టడం తో పాటు ఇంత చిన్న విషయానికి షర్మిలను రిమాండ్ కు తరలించాలని ప్రతిపాదించారు. కాకపోతే న్యాయమూర్తి ఆమెకు బెయిల్ ఇవ్వటంతో అది తప్పింది. ఇంత జరిగిన ఆంధ్ర ప్రదేశ్ మొత్తానికి అన్న గా చెప్పుకుంటూనే జగన్ తన సొంత చెల్లి ఇంత పెద్ద రాజకీయ పోరాటం చేస్తున్నా కనీసం పరామర్శించలేదు. రాజకీయ షర్మిల రాజకీయ నిర్ణయం విషయంలో జగన్ ఆమెతో విభేదించ వచ్చు. కానీ జరిగిన సంఘటన పై మాత్రం కనీసం సొంత చెల్లి కి సంఘీభావం కూడా తెలపలేదు. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ సోమవారం నాడు ఢిల్లీ లో జగన్ తో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి.

ఈ తరుణంలో ప్రధాని మోడీ మంగళవారం ఉదయం వైఎస్ఆర్ టి పీ ప్రెసిడెంట్ వై ఎస్ షర్మిల కు ఫోన్ చేసి మాట్లాడారు. ముఖ్యంగా తాజా గా జరిగిన సంఘటనలు...రాజకీయ అంశాలు ప్రస్తావించారు. పది నిమిషాలు మోడీ షర్మిలతో మాట్లాడినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సొంత అన్న అసలు దీనిపై మాట్లాడక వదిలేస్తే స్వయంగా ప్రధాని మోడీ మాటలాడటం ఖచ్చితంగా ఇది సీఎం జగన్ కు షాక్ వంటి పరిణామం అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవటం పక్కా. మరో వైపు తెలంగాణ లో అధికార టిఆర్ఎస్ మాత్రం షర్మిల బీజేపీ వదిలిన బాణం అంటూ విమర్శలు చేస్తుంది. ఈ తరుణంలో ప్రధాని మోడీ ఫోన్ చేయటం కీలకంగా మారింది. తనకు సంఘీభావం తెలిపిన మోడీపై వై ఎస్ షర్మిల థాంక్స్ చెప్పారు.

Next Story
Share it