Telugu Gateway
Andhra Pradesh

జగన్ కు ఇది అవమానం కాదా?

జగన్ కు ఇది అవమానం కాదా?
X

వై ఎస్ వివేకానంద రెడ్డి సీఎం జగన్ సొంత బాబాయ్. అయన హత్య కేసు కు సంబంధించి సుప్రీమ్ కోర్ట్ తాజాగా చేసిన వ్యాఖలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పరువు తీశాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంతే కాదు ఇది సీఎం జగన్ కు కూడా అవమానమే అని అధికార వర్గాలు వ్యాఖ్యనిస్తున్నాయి. తోలి నుంచి ఈ కేసు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనులు లేపుతుంది. ప్రతిపక్షంలో ఉండగా ఇదే జగన్ తనకు ఆంధ్ర ప్రదేశ్ పోలిసుల పై నమ్మకం లేదు అన్నారు. అయన అధికారంలోకి వచ్చాక జగన్ బాబాయ్ కూతురు సునీత తన తండ్రి హత్యకు సంభందించి ఆంధ్ర ప్రదేశ్ లో అయితే నిష్పక్షపాత విచారణ జరుగుతుంది అని తనకు నమ్మకం లేదని ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీమ్ కోర్ట్ లో పిటిషన్ వేయటం..సునీత లేవనెత్తిన సందేహాలు అన్ని నిజమే అని సిబిఐ కౌంటర్ దాఖలు చేయటం కూడా కలకలం రేపింది. ఇదే జగన్ ప్రతిపక్షములో ఉండగా అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు ను ఈ కేసు లో సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు.

తాను సీఎం ఆయన వెంటనే విచిత్రంగా సిబిఐ విచారణ అవసరం లేదని మాట మార్చటం అప్పటోలోనే పెద్ద కలకలం రేపింది. ఎన్నో ట్విస్టుల మధ్య ఈ కేసు విచారణ సాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లో అయితే ఈ కేసు లో నిష్పక్షపాత విచారణ జరిగే అవకాశం లేదని ప్రాథమిక నిర్దారణకు వచ్చామని సుప్రీమ్ కోర్ట్ కామెంట్ చేసింది అంటే ఇది సీఎం జగన్ కు ఎంతో అవమానం కిందే లెక్కని..ఒక్క సీఎం జగన్ కె కాదు ఇది ప్రభుత్వానికి కూడా అప్రతిష్ట అని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యనించారు. ఈ కేసు విచారణను ఇతర రాష్ట్రానికి బదిలీ చేయటానికి సుప్రీమ్ కోర్ట్ నిర్ణయం తీసుకొని తీర్పు రిజర్వు చేసింది. ఇది రాబోయే రోజుల్లో రాజకీయంగా సీఎం జగన్ కు ఇబ్బందులు సృష్టించటం ఖాయం అని చర్చ సాగుతోంది. వివేకా హత్య అనంతరం జగన్ కుటుంబానికి చెందిన సాక్షి పత్రికలో ఈ హత్యపై నరసురా రక్త చరిత్ర అంటూ పెద్ద స్టోరీ ప్రచురించారు. తర్వాత సీన్ కట్ చేస్తే ఇందులో వేళ్ళు అన్ని కడప ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుల వైపు చూపిస్తున్నాయి. దీనితో ప్రభుత్వం చిక్కుల్లో పడినట్లు ఆయింది .

Next Story
Share it