Telugu Gateway
Andhra Pradesh

జగన్ కు బిగ్ షాక్

జగన్ కు బిగ్ షాక్
X

వైసీపీ అధినేత,ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి కూడా తెలుసు. ఇదే జరుగుతుంది అని. కానీ జగన్ ఇచ్చినట్లు ఉండాలి.. పేదల ఇళ్ల నిర్మాణం ప్రతిపక్షాలు ఆపినట్లు ప్రచారం చేసుకోవాలి. సీఎం జగన్ ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేసేనాటికే హై కోర్ట్ లో ఈ కేసు పై వాదనలు పూర్తి అయి తీర్పు రిజర్వు లో ఉంది. అయినా సరే సీఎం జగన్ అడుగు ముందుకు వేసి ఇళ్ల నిర్మాణానికి రెడీ అయ్యారు. అందులో భాగంగా జులై 24 న అట్టహాసంగా శంఖుస్థాపన చేశారు. ఎప్పటిలాగానే సొంత పత్రిక సాక్షి తో పాటు ఇతర పత్రికలకు యాడ్స్ ఇచ్చుకున్నారు..పని పూర్తి చేశారు. ఈ యాడ్స్, శంఖుస్థాపన కోసం చేసిన ఖర్చు కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఇప్పుడు హై కోర్ట్ స్టే తో ఇది అంతా వృధా అయినట్లు అనే చర్చ సాగుతోంది. అమరావతి రాజధానికి బ్రేకులు వేయటం ద్వారా సీఎం జగన్ ఇప్పటికి వేల కోట్ల రూపాయల పెట్టుబడిని ఆలా వదిలేసినట్లు అయింది అని...ఇప్పుడు ఆర్ 5 జోన్ పేరుతో కూడా జగన్ మళ్ళీ అదే తరహా అట ఆడుతున్నారు అనే విమర్శలు ఉన్నాయి. జనం సొమ్ముతో జగన్ రాజకీయ ఆటలు ఆడుతున్నారు అని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. రాజధాని కోసం రైతులు భూములు ఇస్తే అసలు రాజధానిని అటకెక్కించి..ఆ భూములతో జగన్ రాజకీయ అట ఆడుతున్నారు.

పైకి అమరావతి పై తనకు ఎలాంటి కోపం లేదు అని చెపుతున్నా జగన్ ప్రతి కదలికలో అమరావతి పై కసి కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. ఆర్ 5 జోన్ శంఖుస్థాపన సందర్భంగా జగన్ చెప్పిన మాటలు అన్ని ఇన్ని కావు. హై కోర్ట్ లో 18 కేసు లు, సుప్రీం కోర్ట్ లో ఐదు కేసు లు.. మూడేళ్ళ పాటు కేసు లను పరిస్కహరించుకునేందుకు పోరాటం చేసాం. హై కోర్ట్ లో , సుప్రీమ్ కోర్ట్ లో కూడా కేసు లు గెలిచి ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగాం. ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆపలేక పోయారు కాబట్టి ఇళ్ల నిర్మాణాన్ని ఆపటం కోసం హై కోర్ట్ లో కూడా కేసు వేశారు. ఇంత దారుణం అయినా పరిస్థి తి ఎక్కడకు ఉందదు అనుకుంటా. అన్నిటిని అధిగమించి దేవుడి దయతో సాకారం చేస్తున్నాం అంటూ ప్రకటించారు. ఇదే నిజం అయితే ఇప్పుడు హై కోర్ట్ డివిజన్ బెంచ్ స్టే ఎలా ఇచ్చింది అన్నదే కీలక ప్రశ్న. ఈ తీర్పుపై ప్రభుత్వం సుప్రీం కోర్ట్ లో అప్పీల్ చేయవచ్చు. కానీ అసలు కేసు లు తేలకుండా దీనిపై నిర్ణయం రావటం కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎలా జరిగిన సీఎం జగన్ దీన్ని ఒక రాజకీయ అస్త్రంగా వాడుకోవటం ఖాయం అని చెపుతున్నారు.

Next Story
Share it