Telugu Gateway
Andhra Pradesh

చేతులు మారుతున్న వందల కోట్లు?!

చేతులు మారుతున్న వందల కోట్లు?!
X

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అందరి మోడల్ నే ఫాలో అవుతున్నారా?. తన శాఖకు సంబంధించిన వేల కోట్ల రూపాయల పనులను పారదర్శకంగా టెండర్ల పద్ధతిలో కేటాయించటం కాకుండా...పంపకాల కే మొగ్గు చూపుతున్నారా ?. అంటే అవుననే చర్చ సాగుతోంది అధికార...కాంట్రాక్టు వర్గాల్లో. ఎందుకంటే ఈ పనుల్లో కూడా భారీ వాటాను అంటే రెండు వేల కోట్ల రూపాయలకు పైగా పనులను ఓ మెగా సంస్థ దక్కించుకోనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏ పని వచ్చినా ముందు వినపడే ఈ మెగా కాంట్రాక్టర్ పేరే ఇక్కడ కూడా వినిపిస్తోంది. పైగా ఈ సంస్థ యాజమాన్యంతో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అన్ని చెపుతారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి పనులు ఈ మెగా సంస్థకు దక్కే అవకాశం ఉంది అని సమాచారం.

స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీకి పల్నాడు పనులు కేటాయించే అవకాశం ఉంది అని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సంస్థ గతంలో అమరావతి పనులు కూడా దక్కించుకుంది. చిత్తూర్ జిల్లా లో పనుల కోసం బీజేపీ ఎంపీ కి చెందిన కంపెనీ కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది అని..ఆ ఎంపీ కంపెనీ కే పనులు దక్కటం ఖాయం అనే అధికారులు చెపుతున్నారు. మరో వర్క్ ను బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఒక బడా కాంట్రాక్టు సంస్థ కు కేటాయించే అవకాశం ఉంది. ఈ సంస్థ కూడా గతంలో అమరావతిలో కూడా పనులు చేసింది. ఆంధ్ర ప్రదేశ్ రూరల్ వాటర్ సప్లై డిపార్ట్ మెంట్ చిత్తూర్ జిల్లా లో నీటి సరఫరా , శానిటేషన్ పనుల కోసం 1854 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచింది.

తూర్పు గోదావరి జిల్లాలోని కోస్టల్ ఏరియా లో కూడా నీటి సరఫరా, శానిటేషన్ కోసం 1188 కోట్ల రూపాయలతో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవే పనుల కోసం 1102 కోట్ల రూపాయలు, ప్రకాశం జిల్లా లో పనుల కోసం 1000 కోట్ల రూపాయలతో, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో 1200 కోట్ల రూపాయలతో అంచనాలు సిద్ధం చేసినా కూడా 907 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడితే తన శాఖలో అవినీతి, అక్రమాలకు ఏ మాత్రం ఛాన్స్ ఉందదు అని చెపుతారు. కానీ తన శాఖకు సంబంధించిన టెండర్ల దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం గత ప్రభుత్వాలు ఎలాంటి మోడల్ ను ఫాలో అయ్యాయో అదే మోడల్ ను ఆయన కూడా ఫాలో అవుతున్నారు అనే చర్చ కాంట్రాక్టు సర్కిల్ లో సాగుతోంది. దీని కోసం తెర వెనక భారీ తతంగమే నడుస్తున్నట్లు అధికార వర్గాలు కూడా చెపుతున్నాయి. ఫిబ్రవరి 19 న ఈ పనులు కేటాయింపు పూర్తి అయ్యే అవకాశం ఉంది అని అధికార వర్గాలు చెపుతున్నాయి. రాష్ట్రంలో 6050 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. ముందే ఏ పని ఎవరికీ అన్నది ఫిక్స్ అవటంతో దీని వెనక భారీ గోల్ మాల్ జరగటం ఖాయం అన్నది అధికారులే చెపుతున్న మాట.

Next Story
Share it