ప్రభుత్వంపై కోట్ల రూపాయల అదనపు భారం
పోటీ లేకుండా టెండర్ల పంపకాలు!
పెద్దల జేబులోకి వందల కోట్లు
అధికార వర్గాల్లో హాట్ టాపిక్ మారిన వ్యవహారం
జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడితే తన అంత నిజాయతీ...నిబద్దత గల నేత దేశంలోనే ఎవరూ లేరు అన్నట్లు చెపుతారు. కానీ ఆయన శాఖలో జరుగుతున్న దందా చూస్తుంటే ఆయన కూడా ఇతర నేతలకు ఏ మాత్రం తీసిపోరు అనేలా ఉన్నారు అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. కాకపోతే ఆయన ఎక్కడా ఈ విషయంలో నేరుగా ఇన్వాల్వ్ కాకుండా ఈ వ్యవహరం మొత్తాన్ని పవర్ బ్రోకర్ లింగా కు అప్పగించగా...ఆంతా ఆయనే నడిపించారు అని అధికార వర్గాలు చెపుతున్నాయి.ఈ శాఖలో జరుగుతున్న టెండర్ల గోల్ మాల్ విషయాన్ని విషయాన్ని తెలుగు గేట్ వే ముందుగానే అలెర్ట్ చేసినా కూడా మంత్రి పవన్ కళ్యాణ్ ఏ మాత్రం స్పందించక పోవటంతో దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన చేతికి మట్టి అంటకుండా తమ శాఖలకు చెందిన దందాలు అన్ని ఈ పవర్ బ్రోకర్ ద్వారానే జరిపిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు కూడా చెపుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ టెండర్ ల వ్యవహారం ఆంధ్ర ప్రదేశ్ అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిధిలో ఉన్న గ్రామీణ నీటి సరఫరా శాఖలో కూడా అంటే ‘పవన్ కళ్యాణ్ శాఖలో కూడా టెండర్ల పంపకాలు. చేతులు మారుతున్న వందల కోట్లు’ అంటూ పలు వివరాలతో కూడిన స్టోరీని తెలుగు గేట్ వే. కామ్ ఫిబ్రవరి 13 న పబ్లిష్ చేసింది.
అచ్చం అందులో చెప్పినట్లే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన రెండు పనులు మేఘా ఇంజనీరింగ్ సంస్థకే దక్కాయి. ఈ రెండు పనుల విలువే 2290 కోట్ల రూపాయలు. మరో వందల కోట్ల రూపాయల పని స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీ కి దక్కే అవకాశం ఉంది ఫిబ్రవరి స్టోరీ లో ప్రస్తావించాం. దాని ప్రకారమే గుంటూరు జిల్లా పల్నాడు లో తాగు నీటి సరఫరా ప్రాజెక్ట్ ను లిస్టెడ్ కంపెనీ ఎన్ సిసి కి దక్కింది. ఈ టెండర్ విలువ 906 కోట్ల రూపాయలు. అంటే ఈ లెక్కన రెండు పనులు మేఘాకు..ఒక పని ఎన్ సిసి కి దక్కబోతున్నట్లు చాలా ముందుగానే ఫిక్స్ అయినట్లు స్పష్టంగా తేలిపోయింది. మిగిలిన రెండు ప్రాజెక్ట్ ల్లో ఒకటి ఆర్ విఆర్ ప్రాజెక్ట్స్ కు...మరో కాంట్రాక్టు ను సుధాకర్ ఇన్ఫ్రా కు కేటాయించారు. ఈ ఐదు పనులకు ప్రభుత్వం 6050 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టెండర్లు పిలవగా ప్రతి పనికి 4.5 శాతం పైగా ఎక్సెస్ కే టెండర్లు దాఖలు అయ్యాయి. అంటే ప్రభుత్వంపై ఈ ఎక్సెస్ లతో ప్రభుత్వం పై పడే అదనం భారం కోట్ల రూపాయలు ఉండబోతుంది. ఆర్ విఆర్ ఇన్ఫ్రా కూడా కూటమి ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుల కంపెనీనే.
మరో వైపు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి పనిలోనూ ప్రభుత్వ పెద్దలు...అధికారులు..కాంట్రాక్టర్ లకు మేలు చేసేలా అంచనాల సమయంలోనే భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్నట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. ప్రతి ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ లో ఇది రొటీన్ వ్యవహారంగా మారింది అని ఒక ఐఏఎస్ అధికారి వెల్లడించారు. ఇలా పంపకాలు కాకుండా పోటీ ని అనుమతించి ఉంటే ఈ పనులకు కచ్చితంగా లెస్ కే టెండర్ లు పడేవి అని...కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పెద్దల ఆదేశాలను కాదు అని ఏ కాంట్రాక్టు సంస్థ కూడా టెండర్లు దాఖలు చేసినా కూడా పని చేయటం కష్టం అని..వద్దు అన్నా కూడా ఎవరైనా టెండర్లు వేస్తే బిల్స్ ఇవ్వకుండా చేయటంతో అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతారు అని రెండు దశాబ్దాలుగా ఈ రంగంలో ఉన్న ఒక కాంట్రాక్టర్ వెల్లడించారు.పేరు కు ఇతర సంస్థలు ఈ టెండర్ల కోసం బిడ్స్ వేసినా కూడా అది ఆంతా ఒక ప్లాన్ ప్రకారమే నడిపించటం కోసం మాత్రమే అని తెలిపారు.