Telugu Gateway
Andhra Pradesh

హాట్ టాపిక్ గా ఐ డోంట్ కేర్ కామెంట్స్

హాట్ టాపిక్ గా ఐ డోంట్ కేర్ కామెంట్స్
X

విషయం అదే. ఒకరు చెప్పారు...మరొకరు చెప్పలేదు. అంతే తేడా. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ స్కాం విషయంలో తెలుగు దేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్ ను చాలా మంది ఖండించారు. మరి కొంత మంది మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉన్న వారిలో హరికృష్ణ తనయుడు. టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ కూడా ఉన్నారు. సోషల్ మీడియా లో దీనిపై పెద్ద ఎత్తున రచ్చ కూడా నడిచింది. అయినా సరే ఎన్టీఆర్ మాత్రం అసలు ఈ విషయంపై ట్వీట్ కాదు కదా...ఏ రూపంలోనూ దీనిపై స్పందించ లేదు. దీంతోనే చంద్రబాబు అరెస్ట్ విషయాన్నీ తాను ఏ మాత్రం పట్టించుకోను అనే సంకేతాలను ఎన్టీఆర్ ప్రజల్లోకి పంపారు. కొంత మంది మీడియా ప్రతినిధులు ఆంధ్ర ప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని కొద్ది రోజుల క్రితం ప్రశ్నించగా ఈ విషయాన్నిమీరు ఆయన్నే అడగాలి అంటూ సీరియస్ గా స్పందించారు. తాజాగా బుధవారం నాడు టీడీపీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడారు. అక్కడ బాల కృష్ణ కు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ స్పందించకపోవటంపై మీడియా ప్రతినిదులు ప్రశ్నించగా..బ్రో...ఐ డోంట్ కేర్ అంటూ కామెంట్ చేశారు.

సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళు ఎవరూ చంద్రబాబు అరెస్ట్ పై స్పందించకపోయినా తాను పట్టించుకోను అని తెలిపారు. ఎన్టీఆర్ పై బాలకృష్ణ చేసిన ఐ డోంట్ కేర్ కామెంట్ వైరల్ అయింది.దీంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా....మా వాడు చేసింది కూడా అదేగా అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. తెలంగాణలోని అధికార బిఆర్ఎస్ నేతలపై కూడా బాలకృష్ణ విమర్శలు గుప్పించారు. ఎన్నికలు వస్తున్నాయి అని..కొంత మంది ఎన్టీఆర్ జపం చేస్తున్నారు వ్యాఖ్యానించారు. చంద్ర బాబు అరెస్ట్ అయినప్పుడు స్పందించని నేతలు ఇప్పుడు తాపీగా ఖండన ప్రకటనలు చేస్తున్నారు అని..ఇవి ఓట్ల కోసం తప్ప మరొకటి కాదన్నారు బాలకృష్ణ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటాను అని తెలిపారు.

Next Story
Share it