బద్వేల్ ఎమ్మెల్యే మృతి
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య ఆదివారం నాడు తుది శ్వాస విడిచారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ కన్నుమూశారు. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1960లో జన్మించిన వెంకట సుబ్బయ్య ఆర్థోపెడిక్ సర్జన్‌గా ప్రజలకు సేవలందించారు.
2016లో ఆయన బద్వేల్ వైసీపీ కో-ఆర్డినేటర్‌గా పనిచేశారు. 2019లో తొలిసారిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ ఎమ్మెల్యే మృతితో సీఎం జగన్ కడప జిల్లా పర్యటన తలపెట్టారు. బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కుటుంబాన్ని సీఎం జగన్ పరామర్శించనున్నారు. కడప ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కుటుంబం వద్దకు వెళుతారు. పరామర్శ అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు.