శ్రీకాకుళం జైలుకు అచ్చెన్నాయుడు
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను శ్రీకాకుళం జైలుకు తరలించారు. వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా బెదిరించాడని అచ్చెన్నాయుడిపై కేసు నమోదైంది. అందులో భాగంగానే మంగళవారం నాడు నిమ్మాడలో అచ్చెన్నాయుడుని పోలీసులు అరెస్టు చేసి కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆయనను కోటబొమ్మాళి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం అచ్చెన్నాయుడికి 14 రోజుల రిమాండ్ విధించింది.
అచ్చెన్నాయుడు సొంత గ్రామం అయిన నిమ్మాడలో ఆయన భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. అయితే ఆయన బంధువునే పోటీకి దింపాలని వైసీపీ ప్లాన్ చేసింది. దీంతో అచ్చెన్నాయుడు ఆ బంధువుకు ఫోన్ పోటీ నుంచి ఉపసంహరించుకోవాలని..మిగతా విషయాలు అన్నీ తాను చూసుకుంటానని హామీ ఇఛ్చారు. అయితే ఈ ఫోన్ సంభాషణను బెదిరించినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం నాడు బెయిల్ పిటీషన్ వేయనున్నట్లు అచ్చెన్నాయుడు తరపు లాయర్లు వెల్లడించారు.