జగన్ కు అచ్చెన్నాయుడు రాజీనామా సవాల్
BY Admin15 Feb 2021 4:15 PM

X
Admin15 Feb 2021 4:15 PM
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. 'ఎంపీలు ,ఎమ్మెల్యేలు రాజీనామా చేద్దాం. వైజాగ్ స్టీల్ ఉద్యమానికి సీఎం జగన్ నాయకత్వం వహించాలి. మేం రాజీనామాలకు సిద్ధం. విశాఖ ఉక్కుపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవటం అందరి బాధ్యత' అని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలతో అచ్చెన్నాయుడు సోమవారం నాడు అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ, చిన్నరాజప్ప హాజరయ్యారు. క్షీణిస్తున్న పల్లా శ్రీనివాస్ ఆరోగ్యం..భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మంగళవారం నాడు నిరాహారదీక్ష చేస్తున్న పల్లా శ్రీనివాస్ ను పరామర్శించేందుకు వైజాగ్ వెళ్లనున్నారు.
Next Story