Telugu Gateway
Andhra Pradesh

గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా కూడా అదానీకే!

గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా కూడా అదానీకే!
X

10 శాతం వాటాకు 645 కోట్లు..కేబినెట్ ఆమోదం

అదానీ కంపెనీకి ఇతర వాటాల బదిలీకీ గ్రీన్ సిగ్నల్

గంగవరం పోర్టు పూర్తిగా అదానీల సొంతం కానుంది. ఇప్పటికే 90 శాతం వాటాలను దక్కించుకున్న అదానీ సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం వద్ద మిగిలిన 10శాతం కొనుగోలుకు కూడా అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ (ఏపీఎస్ఈజెడ్) ప్రతిపాదనలు పెట్టింది. ఒక్కో షేరును 120 రూపాయల ధరతో కొనుగోలుకు ఆఫర్ ఇచ్చింది. దీని ప్రకారం 645.1 కోట్ల రూపాయలు ఏపీ సర్కారుకు రానున్నాయి. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా విక్రయానికి సంబంధించి మంగళవారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు.

దీంతో పాటు డీ వీఎస్ రాజుతోపాటు ఇతర సంస్థల నుంచి ఏపీఎస్ఈజెడ్ కొనుగోలు చేసిన వాటాల బదిలీకి సంబంధించి కూడా రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గంగవరం పోర్టు యాజమాన్యంలో పూర్తి మార్పులు జరిగినందున ప్రభుత్వం ఇప్పుడు ఆ సంస్థతో రాయితీ ఒప్పందంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీఎస్ఈజెడ్ గంగవరం పోర్టు సామర్ధ్యాన్ని ఏటా 40 నుంచి 45 మిలియన్ టన్నులకు పెంచనుందని..అతి తక్కువ వ్యవధిలోనే దీన్ని ఏడాదికి 100 మిలియన్ టన్నులకు తీసుకెళ్ళే అవకాశం ఉందన్నారు.

Next Story
Share it