Top
Telugu Gateway

ఏపీ కొత్త సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్

ఏపీ కొత్త సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్
X

ఏపీ సర్కారు తొమ్మిది రోజుల ముందే ఏపీ కొత్త సీఎస్ ను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సహజంగా సీఎస్ రిటైర్మెంట్ ముందు రోజు అలా ఇలాంటి ఉత్తర్వులు వస్తాయి. కానీ చాలా ముందుగానే ఊహగానాలకు తావులేకుండా కొత్త సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 31న సీఎస్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో ఆదిత్యానాథ్‌ దాస్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.

పదవీకాలం పూర్తి అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నీలం సాహ్ని విధులు నిర్వర్తించనున్నారు. ప్రధాన కార్యదర్శితో పాటు మరికొన్ని స్థానాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ కార్యదర్శిగా శ్యామలరావు, పురపాలకశాఖ కార్యదర్శిగా వై.శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా కె.సునీతను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Next Story
Share it