ఏపీ కొత్త మంత్రులు వీళ్లే
సీఎం జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం కొలువుదీరి మూడు సంవత్సరాలు కావస్తున్న తరుణంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ముహుర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న 24 మంది మంత్రులతో రాజీనామాలు చేయించారు. వారి రాజీనామాలు ఆమోదం కూడా పొందాయి. పాత, కొత్తల కలయికతో నూతన మంత్రివర్గం సోమవారం ఉదయం కొలువుదీరనుంది. గత రెండు రోజులుగా సీఎం జగన్ కొత్త మంత్రివర్గ కూర్పుపై కసరత్తు నిర్వహించారు. నూతన మంత్రుల జాబితాను గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు పంపారు. వీరితో ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
కొత్తగా కేబినెట్ లోకి రానున్న వారికి ఇప్పటికే అధికారికంగా సమాచారం పంపారు. ఈ జాబితా ప్రకారం నూతన మంత్రివర్గంలో ఉండనున్న వారి పేర్లు ఇలా ఉన్నాయి. గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, బొత్స సత్యనారాయణ, రాజన్నదొర, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, జోగి రమేష్, విశ్వసరాయ కళావతి, అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత , కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, బూడి ముత్యాలనాయుడు, విడదల రజనీ, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అంజాద్ భాష, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పినిపె విశ్వరూప్, గుమ్మనూరు జయరాం, eర్కే రోజా, ఉషశ్రీ చరణ్, ఆదిమూలపు సురేష్ లు ఉన్నారు.