Telugu Gateway
Andhra Pradesh

నాకు తెలిసింది కొడాలి నాని ఒక్క‌రే..ఆ నాని ఎవ‌రో తెలియ‌దు

నాకు తెలిసింది కొడాలి నాని ఒక్క‌రే..ఆ నాని ఎవ‌రో తెలియ‌దు
X

ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హీరో నాని ఎవ‌రో తన‌కు తెలియ‌దు అన్నారు. త‌న‌కు తెలిసింది కొడాలి నాని ఒక్క‌రే అని వ్యాఖ్యానించారు. ఏపీలో సినిమా టిక్కెట్ల వివాదంపై హీరో నాని గురువారం నాడు స్పందించిన విష‌యం తెలిసిందే. దీనిపై స్పందించాల్సిందిగా మీడియా మంత్రిని కోర‌గా ఆయ‌న మాట్లాడారు. సినిమాల్లో జరిగే దోపిడీ ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రొడక్షన్ కి 30 శాతం ఖర్చు అయితే సినిమా హీరోల రెమ్యునరేషన్ ఖర్చు 70 శాతం ఉంటుందన్నారు. సినిమా హీరోలు వాళ్ల రెమ్యునిరేషన్ తగ్గించు కోవచ్చు కదా అని ప్ర‌శ్నించారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే సినిమాల్లో యాక్ట్ చేసే హీరోలకి ఎందుకు అంత కడుపుమంట అని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌ తన క్రేజ్‌ క్యాష్‌ చేసుకుంటున్నారని ఆరోపించారు. వకీల్‌సాబ్, భీమ్లా నాయక్‌ సినిమాకు అయిన ఖర్చెంత? పవన్‌ రెమ్యూనరేషన్‌ ఎంత? అని ప్ర‌శ్నించారు. పవన్‌ 50 కోట్ల రూపాయ‌లు కాకుండా 10 కోట్ల రూపాయ‌లు తీసుకుంటే ఈ టికెట్‌ ధరలతో నష్టమే ఉండదన్నారు అనిల్ కుమార్ యాద‌వ్. ఒక‌ప్పుడు అభిమానిగా కటౌట్లు పెట్టి తాను కూడా న‌ష్టపోయాన‌న్నారు.

Next Story
Share it