Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో విజ‌య‌వంత‌మైన మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్

ఏపీలో విజ‌య‌వంత‌మైన మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్
X

వ్యాక్సినేష‌న్ విష‌యంలో ఏపీ కొత్త రికార్డు నెల‌కొల్పింది. ఒక్క రోజులోనే అంటే జూన్ 20 సాయంత్రం ఐదు గంట‌ల‌కు 11.85 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. గ‌తంలో ఓ సారి ఇలాగే ఒకే సారి ఆరు ల‌క్షల మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ అయింది. ఆదివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 2,232 కేంద్రాల్లో ఈ డ్రైవ్ త‌ల‌పెట్టారు. 45ఏళ్లు పైబడిన వారు, ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. తూర్పు గోదావ‌రి జిల్లాలో అత్యధికంగా 1,41,230 మందికిపైగా వ్యాక్సిన్ వేశారు. పశ్చిమ గోదావ‌రి జిల్లాలో 1,35,936, కృష్ణా జిల్లాలో 1.23 లక్షల మందికి, విశాఖ జిల్లాలో 1.04 లక్షల మందికిపైగా వ్యాక్సినేషన్‌ వేశారు. వ్యాక్సిన్ల లభ్యతను బట్టి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తోంది.

ఆదివారం ఒకే రోజు ఏకంగా 8 లక్షల మందికి వ్యాక్సిన్లు వేయాలని త‌ల‌పెట్టి... అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకే లక్ష్యాన్ని సాధించి రికార్డు నెలకొల్పింది. సెకండ్ వేవ్ లోనూ ఏపీలో పెద్ద ఎత్తున క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గ‌త కొన్ని రోజులుగా ఈ కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గుముఖం ప‌డుతోంది. దీంతోపాటు కేంద్రం కొద్ది రోజుల క్రితం ఇక నుంచి వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రా బాధ్య‌త‌ను చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. జ‌నాభా ఆధారంగా..క‌రోనా కేసుల వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని వ్యాక్సిన్ల‌ను స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Next Story
Share it