సమన్వయమే అతి పెద్ద సవాల్ !

ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. బిసి లకు 34 శాతం రిజర్వేషన్స్ కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవోలను ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ కొట్టివేసింది. ఆ వెంటనే ప్రభుత్వం ఇదే విషయంలో సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించింది. అయితే అక్కడ కూడా ప్రభుత్వానికి పెద్దగా ఊరట దక్కే అవకాశం లేదు అని...రాజకీయంగా తాము బిసి లకు రిజర్వేషన్స్ విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పటం..చూపించుకోవటం కోసమే ఇది అంతా తప్ప...సుప్రీం కోర్ట్ లో కూడా ఊరట దక్కదు అని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అడ్మిషన్ దశలోని సుప్రీం కోర్ట్ ఈ పిటిషన్ ను కొట్టివేయటం ఖాయం అని..హై కోర్ట్ తీర్పును సమర్ధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. కోర్ట్ లు కొట్టివేసిన కూడా టీడీపీ పార్టీ పరంగా ఈ రిజర్వేషన్స్ అమలు చేయటానికి నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెపుతున్నారు. ప్రస్తుతం కూటమిగా ఉన్న ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ లు భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇవి కలిసే ముందుకు సాగనున్నాయి. అ
ఆంధ్ర ప్రదేశ్ లో మరో కీలక నగరం తిరుపతి మేయర్ సీటు ను మరో మిత్ర పక్షం బీజేపీ కి కేటాయించే అవకాశం ఉంది విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీజేపీ కూడా వైజాగ్ మేయర్ సీటు కోరుతున్నా కూడా అది జరిగే పని కాదు అని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని ఈ మూడు కీలక నగరాల విషయంలో ఇప్పటికే ప్రాధమికంగా ఒక అంచనాకు వచ్చారు అని...మిగిలిన చోట్ల మాత్రం ఆయా పార్టీలకు ఉన్న బలాల ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జనసేన కు మంచి పట్టున్న ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఆ పార్టీ కి మరో మేయర్ సీట్ కేటాయిస్తారు అనే అంచనాలు ఉన్నాయి. అయితే విజయవాడ మేయర్ సీటు కోసం అధికార తెలుగు దేశం పార్టీలో చాలా మంది రేస్ లో ఉన్నారు. పొత్తులో భాగంగా జనసేన కు ఈ సీటు కేటాయిస్తే నాయకుల పోటీ ని నివారించటంతో పాటు మిత్రపక్షానికి అత్యంత కీలక స్థానం ఇచ్చినట్లు కూడా అవుతుంది అని టీడీపీ నాయకత్వం లెక్కలు వేసుకుంటుంది.
విజయవాడ మేయర్ సీటు జనసేన కు కేటాయిస్తున్నందున ఆ పక్కనే ఉండే మరో కీలక నగరం గుంటూరు మేయర్ సీటు లో టీడీపీ అభ్యర్ధే బరిలో ఉంటారు అని చెపుతున్నారు. ఈ సారి మేయర్ ను ప్రజలే నేరుగా ఎన్నికోనున్నారు. గతంలో ఎన్నికైన కార్పొరేటర్లు మెజారిటీ ఉన్న పార్టీ అభ్యర్థిని మేయర్ గా ఎన్నుకునే వారు. అవిశ్వాసాలతో పాటు ఇతర గందరగోళాలు లేకుండా ఉండేందుకు ఈ సారి మేయర్ కు ప్రత్యక్ష ఎన్నిక జరపనున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య ఎలాంటి వివాదాలు లేకుండా ముందుకు సాగటమే ఇప్పుడు టీడీపీ, జనసేన కు కత్తిమీద సాము కానుంది. ఎక్కడ లెక్క తేడా వచ్చినా కూడా ఆ ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుంది. పైకి కనిపించకపోయినా ముఖ్యంగా జనసేన, టీడీపీ ల విషయంలో పలు జిల్లాల్లో నాయకులు..క్యాడర్ మధ్య గ్యాప్ బాగా ఉంది అని చెపుతున్నారు. పై స్థాయిలో అంతా బాగున్నట్లు కనిపించినా కూడా క్షేత్ర స్థాయిలో పరిస్థితులే ఎన్నికలకు అత్యంత కీలకం అన్న సంగతి తెలిసిందే.



