దూళిపాళ నరేంద్రకు బెయిల్ మంజూరు
BY Admin24 May 2021 11:08 AM IST

X
Admin24 May 2021 11:08 AM IST
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్రకుమార్ కు బెయిల్ మంజూరు అయింది. సోమవారం నాడు ఏపీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దూళిపాళ్ళ ప్రస్తుతం సంగం డెయిరీ ఛైర్మన్ గా ఉన్నారు. డెయిరీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఆయన్ను ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత నెల 23న ఆయన్ను అరెస్ట్ చేశారు. ఏసీబీ అరెస్ట్ తర్వాత నరేంద్రకు కరోనా సోకటంతో ఆయనకు విజయవాడలో కొన్ని రోజులు చికిత్స అందించారు.
ప్రస్తుతం రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉన్నారు. విజయవాడలో ఉండే అడ్రస్ ను దర్యాప్తు అధికారులకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో నాలుగు వారాల పాటు విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉండాలన్నారు. నరేంద్రతోపాటు సంగం డెయిరీ ఎండీకి కూడా బెయిల్ మంజూరు అయింది.
Next Story