ఏపీలో కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు
BY Admin16 May 2021 2:01 PM

X
Admin16 May 2021 2:01 PM
కరోనా మృతులకు సంబంధించి ఏపీ సర్కారు నూతన జీవో జారీ చేసింది. మృతుల అంత్యక్రియలకు 15 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ అగర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ పై పోరుకు కేటాయించిన నిధుల నుంచే ఈ మొత్తాలను చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి కోవిడ్ మరణానికి ఈ కేటాయింపులు చేస్తారని తెలిపారు.
Next Story