Telugu Gateway
Andhra Pradesh

లోకేష్ సమక్షంలో ఒప్పందం

లోకేష్ సమక్షంలో ఒప్పందం
X

నిన్న మొన్నటి వరకు ఇండియా నుంచి వైద్య విద్య కోసం విద్యార్థులు పెద్ద ఎత్తున జార్జియా వెళ్లేవారు. దీనికి ప్రధాన కారణం అక్కడ అతి తక్కువ వ్యయంతో వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఉండటమే. అయితే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కీలక ఒప్పందం చేసుకుంది. ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. దీని కోసం విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో సోమవారం జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ SEU (GNU)తో అవగాహన ఒప్పందం కుదిరింది.

ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో జిఎన్ యు, ఎపి ప్రభుత్వ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం ఉత్తరాంధ్రలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్థాపించడానికి GNU సుమారు రూ.1,300 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ ఒప్పందంతో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందడంతోపాటు 500మందికి ఉపాధి లభిస్తుంది అని అధికార వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యత తో కూడిన విద్యా అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు.

Next Story
Share it