Telugu Gateway
Andhra Pradesh

ఏ బీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు ఏపీ సర్కారు షోకాజ్ నోటీసులు

ఏ బీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు ఏపీ సర్కారు షోకాజ్ నోటీసులు
X

పెగాసెస్ స్పైవేర్ కొనుగోలుతోపాటు త‌న స‌స్పెన్ష‌న్ గడువు అంశంపై ఇటీవల మీడియా స‌మావేశంలో మాట్లాడిన సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏ బీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు ఏపీ స‌ర్కారు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇది ఖ‌చ్చితంగా స‌ర్వీసు రూల్స్ ఉల్లంఘ‌న కింద‌కే వ‌స్తుంద‌ని..వారం రోజుల్లో ఈ నోటీసుల‌కు స‌మాధానం ఇవ్వాల‌ని అందులో సీఎస్ స‌మీర్ శ‌ర్మ ఆదేశించారు. నోటీసుకు స‌మాధానం ఇవ్వ‌క‌పోతే త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అందులో పేర్కొన్నారు. ఏ బీ వెంకటేశ్వ‌ర‌రావు మీడియా స‌మావేశం నిర్వ‌హించిన మ‌రుస‌టి రోజే ఈ నోటీసులు జారీ చేశారు. ఆలిండియా సర్వీస్‌ రూల్స్‌లోని 6వ నిబంధన పాటించకుండా మీడియా సమావేశం పెట్టడం త‌ప్పు అని అందులో పేర్కొన్నారు.

Next Story
Share it