Telugu Gateway
Andhra Pradesh

ఆంధ్ర ప్రదేశ్ గ్రోత్ స్టోరీ ఇన్ దావోస్ పేరుతో ప్రచారం

ఆంధ్ర ప్రదేశ్ గ్రోత్ స్టోరీ ఇన్ దావోస్ పేరుతో ప్రచారం
X

ఆంధ్ర ప్రదేశ్ గ్రోత్ స్టోరీ ఇన్ దావోస్ పేరుతో ఎన్ డీటివి తో పాటు ఎన్ డీటివి ప్రాఫిట్ లో ప్రచారం కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 75 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం నాడు జీవో 85 జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చే డెబ్భై ఐదు లక్షల రూపాయలు తీసుకుని ఈ రెండు చానెల్స్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విధానాలతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి, ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న నైపుణ్యం గల మానవ వనరులు వంటి అంశాలపై ప్రచారం చేయాల్సి ఉంటుంది. తద్వారా దేశీయంగా...అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించు అని పేర్కొన్నారు.

ఎప్పటిలాగానే ఈ సారి కూడా దావోస్ మీటింగ్ కు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు భారీ బృందం వెళ్లనుంది. దీనిపైనే కోట్ల రూపాయల వ్యయం చేయనున్నారు. కానీ మూడు రోజుల దావోస్ మీటింగ్ కోసం రెండు చానెల్స్ కు కలిపి 75 లక్షల రూపాయలు మంజూరు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు తామే బ్రాండ్ అంబాసిడర్లు గా చెప్పుకునే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు ఇప్పుడు రెండు చానెల్స్ తో ప్రచారం చేయించుకుంటే పెట్టుబడులు పరుగులు పెడతాయా?.

Next Story
Share it