Telugu Gateway
Andhra Pradesh

ఏపీలోనూ ఉద్యోగాల భ‌ర్తీ

ఏపీలోనూ ఉద్యోగాల భ‌ర్తీ
X

తెలంగాణ స‌ర్కారు ఇటీవలే భారీ ఎత్తున ఉద్యోగ ఖాళీల‌ను భర్తీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌కటించింది. సీఎం కెసీఆర్ అసెంబ్లీ వేదిక‌గా ఏకంగా 80వేల‌కు పైగా ఉద్యోగాల భ‌ర్తీ చేస్తామ‌న్నారు. ఇప్పుడు ఏపీ స‌ర్కారు కూడా గ్రూప్స్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. గ్రూప్ 1 కేటగిరీ కింద 110 పోస్టులు, గ్రూప్‌-2 కేటగిరీ కింద 182 పోస్టులకు అనుమతి లభించింది. దీంతో ఏపీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్లు జారీ చేయనుంది. డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీవో, సీటీవో, డిఎస్పీ, డి ఎఫ్ ఓ, మున్సిపల్ కమిషనర్, ఎంపిడివో పోస్టుల భర్తీకి, ఇక గ్రూప్‌-2 లో డిప్యూటీ తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్ లు, మున్సిపల్ కమిషనర్ లు, ట్రెజరీ అధికారులు తదితర ఖాళీల భర్తీకి సీఎం వైఎస్‌ జగన్‌ అనుమతి ఇచ్చారు.

Next Story
Share it