Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో నెలాఖరు వరకూ కర్ఫ్యూ పొడిగింపు

ఏపీలో నెలాఖరు వరకూ కర్ఫ్యూ పొడిగింపు
X

రాష్ట్రంలో కరోనా కేసుల రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకూ పొడిగించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే సీఎం జగన్ పూర్థి స్థాయి లాక్ డౌన్ కు నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం కర్ఫ్యూ పొడిగింపునకే నిర్ణయం తీసుకుంది. అయితే ఏపీలో పెరుగుతున్న కేసులు..పాజిటివిటి అంశంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో ప్రస్తుతం ప్రతి రోజూ మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వత పూర్తి స్థాయి కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. మరికొన్ని రోజులు కర్ఫ్యూను కొనసాగిస్తే తప్ప మెరుగైన ఫలితాలు రావని సీఎం జగన్ అభిప్రాయపడినట్లు అధికారులు తెలిపారు. అయితే పాజిటివిటి రేటు పది శాతం పైన ఉన్న చోట లాక్ డౌన్ అమలు చేయాలని ఐసీఎంఆర్ వంటి సంస్థలు కేంద్రానికి సిఫారసు చేశాయి.

అయితే కేంద్రం మాత్రం దీనిపై నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. కోవిడ్‌ కారణణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. వారికి ఆదుకునేలా ఆర్థికసహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. వారిపేరుమీద కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా వారి ఖర్చులకోసం వచ్చేలా ఆలోచనలు చేయాలని అన్నారు.

Next Story
Share it