డాక్టర్లూ ఏపీపై దయ చూపండి..లేకపోతే యాడ్స్ ఆగేలా లేవు !
ఎంత పెద్ద ఉద్యోగానికి అయినా ఒక సారి నోటిఫికేషన్ ఇస్తారు. అవసరం ఉన్న వాళ్ళు అది చూసి అప్లై చేసుకుంటారు. అందులో సత్తా ఉన్న వారికి జాబ్ దక్కుతుంది. ఇది అందరికి తెలిసిన వ్యవహారం. కాకపోతే ఆంధ్ర ప్రదేశ్ సర్కారు తీరు చూసి అధికారులు కూడా షాక్ కు గురి అవుతున్నారు. స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకం కోసం ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ వరసగా యాడ్స్ ఇస్తూ పోతోంది. ఈ యాడ్స్ ఇప్పటికే పలు మార్లు పత్రికల్లో దర్శనం ఇచ్చాయి. మరో సారి గురువారం నాడు కూడా రిపీట్ అయ్యాయి. ఇది చూసిన ఒక అధికారి డాక్టర్లు దయచేసి ఆంధ్ర ప్రదేశ్ ఇస్తున్న ఆఫర్లు ఉపయోగించు కోవాలి లేక పోతే సర్కారు డబ్బు అంతా ఈ యాడ్స్ కింద ఖర్చు అయ్యేలా ఉందని ఎద్దేవా చేశారు. ఎందుకు అంటే ఈ యాడ్స్ ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణాలో కూడా దర్శనం ఇస్తున్నాయి. తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో పలు మార్లు యాడ్స్ఇచ్చినా వీటిపై ఎవరు స్పందిస్తున్నట్లు లేరనే చర్చ కూడా సాగుతోంది.