Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో షాప్ లు మధ్యాహ్నం 12 గంటల వరకే

ఏపీలో షాప్ లు మధ్యాహ్నం 12 గంటల వరకే
X

ఏపీలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న తరుణంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాత్రి కర్ప్యూ అమల్లో ఉండగా...ఇప్పుడు పాక్షిక కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇచ్చింది.

అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు 144 సెక్షన్‌ అమలు కానుంది. రెండు వారాల పాటు కర్ఫ్యూ కొనసాగనుందని తెలిపారు. కోవిడ్ నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవటంతోపాటు ఆస్పత్రుల్లో బెడ్స్ సంఖ్య పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

Next Story
Share it