Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో రాత్రి క‌ర్ప్యూ తొల‌గింపు

ఏపీలో రాత్రి క‌ర్ప్యూ తొల‌గింపు
X

ఏపీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గటంతో రాత్రి క‌ర్ఫ్యూ ఎత్తేయాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. వైద్య శాఖ అధికారుల నివేదిక మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. రాత్రి క‌ర్ఫ్యూ తొల‌గించినా...కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ప్ర‌జ‌లు అంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ లు ధ‌రించేలా చూడాల‌న్నారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ జాగ్రత్తలు పాటించేలా చూడాలని అధికారుల్ని సీఎం జగన్‌ ఆదేశించారు.రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర​ సర్వే కొనసాగించాలల‌న్నారు. ల‌క్షణాలు ఉన్నవారికి టెస్టులు కొన‌సాగ‌నున్నాయి. ​ వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌ను త్వరగా పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు.

గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్టు వైద్యులకు, వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు సీఎం వెల్లడించారు. స్పెషలిస్టు వైద్యులకు ఇస్తున్న మూలవేతనంలో 50శాతం, వైద్యులకు 30 మేర ప్రత్యేక ప్రోత్సాహకంగా ఇచ్చేలా మార్గదర్శకాలు తయారు చేసినట్టు అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.82 శాతానికి ప‌డిపోయిన‌ట్లు అధికారులు తెలిపారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను కొన‌సాగించాల‌ని..సాధ్య‌మైనంత వేగంగా ఈ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేయాల‌న్నారు.

Next Story
Share it