Telugu Gateway
Andhra Pradesh

ఇవి పొలిటికల్ పెట్టుబడులా...ప్రాజెక్ట్ పెట్టుబడులా!

ఇవి పొలిటికల్ పెట్టుబడులా...ప్రాజెక్ట్ పెట్టుబడులా!
X

‘పెట్టుబడుల సాధనకు సంబంధించి మేము వాస్తవ అంచనాలు మాత్రమే చెపుతాం. గొప్పల కోసం లెక్కలు ఎక్కువ చేసి ఏమీ చూపించం. జగన్ సీఎం అయిన తర్వాత తొలిసారి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) ద్వారా రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నాం’ ఇదీ ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ సదస్సు ప్రారంభం కాక ముందు పలు మార్లు చెప్పిన మాట. వైజాగ్ ఇంచార్జి మంత్రి విడదల రజని కూడా మీడియా సాక్షిగా ఇదే మాట చెప్పారు. అదేమి విచిత్రమో ప్రభుత్వమే రెండు అంటే రెండు లక్షల కోట్లు టార్గెట్ పెట్టుకుంటే ఏకంగా రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చినట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రెండు లక్షల కోట్ల రూపాయల అంచనా ఎక్కడ?. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఎక్కడ. ఇది చుసిన వాళ్ళు అంతా చివరకు సీఎం జగన్, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ అంచనాకు కూడా అందనంత భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చినట్లు ఉన్నాయనే కామెంట్స్ చేస్తున్నారు. జీఐఎస్ సదస్సులో హంగామా చేసిన జీఎంఆర్ అధినేత మల్లికార్జున్ రావు భోగాపురం ఎయిర్ పోర్ట్ ద్వారా ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి సర్కారు తో రాయితీ ఒప్పందం కుదుర్చుకుని మరికొన్ని నెలల్లో మూడేళ్లు కానుంది. కానీ ఇంతవరకు అడుగు ముందుకు పడలేదు. ఇప్పటి వరకు కనీసం శంఖుస్థాపన కూడా చేయలేదు. మరొకటి ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ అంశం. ఈ కంపెనీ 2023 ఫిబ్రవరి లోనే అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద ఎనర్జీ పార్క్ ఏర్పాటు చేసి గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్ తయారు చేస్తామని..ఇక్క్డడ మొత్తం 1 .10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని...55000 వేల కోట్ల రూపాయల లెక్కన రెండు దశల్లో ఈ పెట్టుబడులు ఉంటాయని ఎన్టీపీసీ గతంలోనే ప్రకటించింది. ఇప్పుడు ఎంఓ యు లో వీటికి కూడా చోటు కల్పించినట్లు సమాచారం. అప్పులు తీర్చటానికి అదానీ గ్రూప్ ఇప్పుడు సొంత వాటాలు అమ్ముకుంటోంది. అలాంటిది అదానీ గ్రీన్ ఎనర్జీ ఈ దశలో ఆంధ్ర ప్రదేశ్ లో 21820 కోట్ల రూపాయలు పెట్టుబడి అంటే అది సాధ్యం అయ్యే పని కాదు అని చెపుతున్నారు.

అన్నింటి కంటే ముఖ్యంగా ఎన్నికల ఏడాది లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే ఏ కంపెనీ అయినా ఆచితూచి అడుగులు వేస్తాయని..అంతే తప్ప అలా ఒప్పందాలు చేసుకుని ఇలా యూనిట్ ల ఏర్పాటుకు పరుగులు తీసే అవకాశం ఉండదన్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో సీఎం జగన్ కొన్ని విద్యుత్తు సంస్ధలతో పాటు...మౌలికవసతుల కల్పనా సంస్థలతో వ్యవహరించిన తీరు దేశ వ్యాప్తంగా కార్పొరేట్ వర్గాలకు ప్రతికూల సంకేతాలు పంపింది. ఇప్పుడు జరిగిన జీఐఎస్ లో ఒప్పందాలు వాస్తవరూపం దాల్చాలంటే అది ఎవరిది అయినా సరే కొత్త ప్రభుత్వంలో తప్ప ఇప్పటిలో సాధ్యం కాదు అని...కాకపోతే రాజకీయంగా ప్రచారం చేసుకోవటానికి మాత్రం పనికి వచ్చే అంశంగా ఉంటుంది. ప్రతిపక్షంలో ఉండగా అసలు దావోస్ సదస్సులకు వెళ్లాలా,..పెట్టుబడి సదస్సులు పెట్టాలా అని ప్రశ్నించిన వైసీపీ,, సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిటి విషయంలో లాగా దీంట్లోనే రివర్స్ గేర్ వేశారు. రెండు లక్షల కోట్లు టార్గెట్ అని చెప్పి...ఇప్పుడు 13 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇవి అన్ని నిజం లెక్కలేనా కాదో చెప్పాలి. ఈ జాబితాలో అస్మదీయ సంస్థ అరబిందో తో పాటు ప్రభుత్వ వర్గాలకు సన్నిహితులు అయినా వారి పేర్లు ఉన్నాయి. ఇప్పుడు కొంత మంది పారిశ్రామిక వేత్తలు కూడా పార్టీల వారీగా చీలిపోయిన వాతావరణం ఉంది. అంటే ఒకరు అధికారంలో ఉంటే కొంత మంది హవా నడుస్తుంది...అధికారం మారితే కొత్త ఫేసులు తెరమీదకు వస్తాయి. అధికారంలో ఎవరు ఉన్నా హవా చెలాయించే వాళ్ళు కూడా ఉంటారు అయితే వాళ్ళు కొంతమందే. వైజాగ్ లో సాగుతున్న జీఐఎస్ హంగామా చూసి చంద్రబాబే ఎక్కువ హడావుడి చేస్తారు అనుకుంటే..జగన్ షో అంత కంటే ఎక్కువే ఉంది అని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించటం విశేషం.

Next Story
Share it