ఫైబర్ నెట్ కేసు..సాంబశివరావుకు బెయిల్

ఏపీ ఫైబర్‍నెట్ కేసుకు సంబంధించి మాజీ ఎండీ సాంబశివరావుకు హైకోర్టులో బెయిల్ లభించింది. రెండు రోజుల క్రితం ఆయన్ను ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐఆర్ టీఎస్ అధికారి అయిన సాంబశివరావు తనకు 48 గంటల్లో బెయిల్ రాకపోతే ఉద్యోగం పోతుందని కోర్టు కు విన్నవించారు. కేంద్రానికి సమాచారం ఇవ్వకుండా అఖిలభారత సర్వీస్ అధికారిని అరెస్ట్ చేయడంపై సీనియర్ న్యాయవాదులు ఆదినారాయణరావు, యలమంజుల బాలజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకపోయినా ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
దీంతో కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు పనుల తొలి దశను టెరా సాఫ్ట్ వేర్ కు కేటాయించారు. ఈ కేటాయింపుల్లో అక్రమాలు, అవినీతి జరిగిందని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అందులో భాగంగానే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అరెస్ట్ కు ముందుకు సాంబశివరావుతోపాటు ఐటి సలహాదారు వేమూరి హరిప్రసాద్ ను కూడా విచారించిన విషయం తెలిసిందే.