పీఆర్సీతో పాటు సీపీఎస్ కూడా తేల్చాల్సిందే

ఏపీ సర్కారు తీరు తీరుపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. కేవలం కాలయాపన కోసం సమావేశాలు పెడుతూ ఉద్యోగులను అవమానిస్తున్నారని..ఇది ఏ మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఈ సారి సమావేఏశం ఏదైనా ఉంటే నిర్ణయం చెప్పటానికి పిలవాలని..లేదంటే ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్ళటానికి మాత్రమే పిలవాలన్నారు. జనవరి 3న జరిగే సమావేశంలో తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. అధికారులతో సమావేశం అనంతరం ఉద్యోగ సంఘం నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారం రోజుల్లో నిర్ణయం అన్నారు. తర్వాత 72 గంటలు అన్నారు. తర్వాత సీఎస్ మాట్లాడుతూ సీఎంతో సమావేశం అన్నారు. కానీ సమావేశాల మీద సమావేశాలు పెట్టి ఉద్యోగుల సహనానికి పరీక్ష పెడుతున్నారని బండి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. అనంతరం బొప్పరాజు మాట్లాడుతూ ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలకే పోతుందనే తరహాలో దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇది ఏ మాత్రం సరికాదన్నారు. లెక్కలే కావాలంటే ఆ అదికారులకు ఇచ్చిన లెక్కలు ఇచ్చిన అధికారులు కూడా తమ వారేనని..తాము కూడా దీనిపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు ఆదాయం కూడా ఏమీ తగ్గలేదన్నారు.
పీఆర్సీతోపాటు సీపీఎస్ విషయం కూడా ఏదో ఒక తేల్చాలన్నారు. ప్రభుత్వం ఏమి చెపితే అది తాము ఉద్యోగులకు వివరిస్తామని..లేదంటే ప్రభుత్వమే నేరుగా చె్పినా తమకు అభ్యంతరం లేదన్నారు. టాయ్ లెట్లు క్లీన్ చేయలేదని ఒక్క రాయలసీమ జోన్ లోనే 2500 మంది హెడ్ మాస్టర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వటం దారుణం అని బొప్పరాజు మండిపడ్డారు. వారి సమస్యలపై ధర్నా చేసిన టీచర్ల సంఘం నాయకుడి ఒత్తిడి చేసి మరీ సస్పెండ్ చేయటం దారుణం అన్నారు. పీఆర్సీలపై గతంలో ఎన్నోసార్లు చర్చలు చూశామని..కానీ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి మాత్రం లేదన్నారు. ఉద్యోగులకు సంబంధించి ఆరు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని..కానీ ఇంత వరకూ ఆ నిధులు సర్దుబాటు చేయటంలేదన్నారు. తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండానే ట్యాక్స్ లు మాత్రం కట్ చేస్తున్నారని..ఇది దారుణంగా ఉందన్నారు.



