Telugu Gateway
Andhra Pradesh

రూలింగ్ పార్టీల కంటే అధికంగా సీటు వస్తే ప్రతిపక్ష హోదా అంట

రూలింగ్ పార్టీల కంటే అధికంగా సీటు వస్తే ప్రతిపక్ష హోదా అంట
X

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వింత వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో గవర్నర్ ప్రసంగం...సభలో వైసీపీ ప్రవర్తించిన తీరుపై పవన్ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడారు. ఆయన తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని వింత వ్యాఖ్యలు చేశారు. అవేంటో మీరు చూడండి. ‘ప్రతి పక్ష హోదా ఏ పరిస్థితుల్లో వస్తుంది అంటే మీకు రూలింగ్ పార్టీస్ కంటే కూడా అత్యధికంగా కూడా ఒక సీటు వాళ్ళ కంటే వస్తే ...దాని తర్వాత స్థానం మీకు వస్తే ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన..11 సీట్లు ఉన్న వైసీపీ కి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది?.’ అంటూ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ మాటలు విన్న వాళ్ళు ఒకింత షాక్ కు గురి అయినా కూడా ఎవరూ అక్కడ ఆయనకు ఎదురు చెప్పే ఛాన్స్ ఉండదు కాబట్టి అంతా మౌనాన్ని ఆశ్రయించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ మాట్లాడుతూ సభలో వైసీపీ కాస్త హుందాగా వ్యవహరించాలి. గవర్నర్ ప్రసంగాన్ని విని లోపాలు ఉంటే చెప్పాలి తప్ప...రాగానే గొడవకు దిగటం మంచిది కాదు.

పేజీలు చింపి విసిరేయటం కరెక్ట్ కాదు. ప్రతిపక్ష హోదా కావాలి అంటే ...నిజంగా కావాలి అంటే కూడా ఈ ఐదు సంవత్సరాల్లో రాదు. మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి. రూల్స్ ఉన్నాయి..నార్మ్స్ ఉన్నాయి. ఎవరో ఒకరు అనుకుంటే అది ఇచ్చేది కాదు. నేను ఉప ముఖ్యమంత్రి ని అయినా మంత్రి కిందే లెక్క. దానికి ప్రత్యేక ప్రోటోకాల్ ఉండదు. తాము కూడా లేని ప్రోటోకాల్ అడగం అని చెప్పారు. రాష్ట్రంలోని 175 సీట్ల లో కేవలం 11మాత్రమే వైసీపీ కి ఇచ్చారు అది వాళ్ళు గుర్తుంచుకోవాలి. వైసీపీ కి వచ్చిన ఓటు శాతం ఆధారం గా ఇక్కడ హోదా ఇవ్వటం కుదరదు అని..అలా కావాలి అంటే జర్మనీ కి వెళ్ళిపోవాలి అన్నారు.

Next Story
Share it