అప్పుడు అలా..ఇప్పుడు ఇలా
రవాణా చార్జీలు మరీ ఎక్కువగా ఉండటం ఒకటి అయితే...అవసరానికి ఇసుక దొరక్క చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఇదే విషయంపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అయినా సరే ప్రభుత్వంలో ఉండి...పరిష్కరించాల్సిన కీలక స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లు మౌనంగా ఉండటం చర్చనీయాంశగా మారింది. అంటే వీళ్ళు తమ శాఖల విషయాలు తప్ప ..ప్రభుత్వంలో ఏమి జరిగినా పట్టించుకోరా అన్న చర్చ కూడా సాగుతోంది. విచిత్రం ఏమిటి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సన్నిహిత విద్యుత్ కంపెనీలతో కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళు లాలూచీ పడ్డారు అని..ఈ వ్యవహారంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని చెపుతున్నారు. అయినా సరే పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన మంత్రులు మౌనంగా ఉంటున్నారు అంటే..ఎవరికీ దక్కాల్సిన వాటాలు వాళ్లకు దక్కుతున్నాయి అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఎంతో కీలకం అయిన ఇసుక విషయంలో కూడా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారా అన్న చర్చ టీడీపీ నాయకుల్లో కూడా సాగుతోంది.