ఏపీలో ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకూ ఓపెన్
BY Admin18 Jun 2021 4:43 PM IST
X
Admin18 Jun 2021 4:43 PM IST
అన్ లాక్ ప్రక్రియలో మరో అడుగు. ఏపీలో కర్ఫ్యూ సడలింపులు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే సడలింపులు ఉన్నాయి. వీటిని ప్రస్తుతం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకూ పెంచారు. ఈ మేరకు సీఎం జగన్ దగ్గర జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జూన్ 21 నుంచి 30 వరకు సడలింపులు అమల్లో ఉంటాయని తెలిపింది.
సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఇస్తుండగా.. తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఇచ్చారు. కోవిడ్ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున ఈ జిల్లాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఇచ్చారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పని చేస్తాయని తెలిపారు. ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు చేశారు.
Next Story