Top
Telugu Gateway

ఏపీలో క‌ర్ఫ్యూ కొన‌సాగింపుపై జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

ఏపీలో క‌ర్ఫ్యూ కొన‌సాగింపుపై జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు
X

జూన్ 20 త‌ర్వాత కూడా ఏపీలో క‌ర్ఫ్యూ కొన‌సాగే అవ‌కాశం ఉంది. అయితే ప్ర‌స్తుతం ఉన్న నిబంధ‌న‌లు కాకుండా..మ‌రింత స‌డ‌లింపుల‌తో క‌ర్ఫ్యూ కొన‌సాగించ‌నున్నారు. బుధ‌వారం నాడు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ మేర‌కు స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చారు. క‌రోనా ఇప్ప‌ట్లో పోయేలా లేద‌ని..ఓ వైపు వ్యాక్సినేష‌న్ తోపాటు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంద‌ని తెలిపారు. స్పంద‌న స‌మావేశంలో మాట్లాడుతూ జ‌గ‌న్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. ఏపీలో మూడున్నర కోట్ల మందిలో 69లక్షల మందికి సింగిల్‌ డోసు ఇచ్చినట్టు వెల్లడించారు.ఇప్పటివరకు 26,33,351 మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ ఇచ్చామని తెలిపారు. గ్రామాల్లో ఫీవర్‌ సర్వే కొనసాగించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. 89శాతం మంది కోవిడ్‌ బాధితులు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద 14 వేల మందికిపైగా కోవిడ్‌ వైద్య సేవలు పొందుతున్నారని సీఎం అన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

మొదటిసారి పెనాల్టీ, రెండోసారి ఉల్లంఘిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని అధికారులకు చెప్పారు. థర్డ్‌వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పిల్లల వైద్యం కోసం మూడు అత్యాధునిక ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయని, విశాఖ, కృష్ణా-గుంటూరు, తిరుపతిలో చిల్డ్రన్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు పిల్లలకు వైద్య సేవలందిస్తాయని ఆయన పేర్కొన్నారు. థ‌ర్డ్ వేవ్ వ‌స్తుందో రాదో చెప్ప‌టం క‌ష్ట‌మ‌న్నారు. గ‌తంతో పోలిస్తే ఏపీలో ప్ర్సుతుతం క‌రోనా కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. అందుకే సీఎం జ‌గ‌న్ కూడా ప‌లు సడ‌లింపుల‌తో క‌ర్ఫ్యూ కొన‌సాగింపున‌కు మొగ్గుచూపుతున్నారు. కోర్టుల‌కు వేస‌వి సెల‌వులు పూర్తయినందున కోర్టుల్లో ఉన్న ఇళ్ళ ప‌ట్టాల అంశంపై ఫోక‌స్ పెట్టాల‌న్నారు. ప‌క్కా స‌మాచారంతో కోర్టుల్లో ఈ కేసులు ప‌రిష్కారం అయ్యేలా చూడాల‌ని ఆదేశించారు.

Next Story
Share it