Telugu Gateway
Andhra Pradesh

ఎస్ఈసీ సమావేశానికి సీఎస్..డీజీపీ, కలెక్టర్లు డుమ్మా

ఎస్ఈసీ సమావేశానికి సీఎస్..డీజీపీ, కలెక్టర్లు డుమ్మా
X

ఏపీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశానికి అందరూ డుమ్మా కొట్టారు. సీఎస్ దగ్గర నుంచి మొదలుపెడితే డీజీపీ, జిల్లా కలెక్టర్లతో సహా ఎవరూ ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఈ ఎన్నికల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాల ప్రకారమే తాను ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రమేష్ కుమార్ శనివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. అయినా సరే సర్కారు మాత్రం వ్యాక్సినేషన్, ఎన్నికలు ఒకేసారి కుదరవని స్పష్టం చేస్తోంది.

దీంతోపాటు సుప్రీంకోర్టులో తాము హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేసినందున ఆ తీర్పు వచ్చేవరకూ ఆగమని చెబుతోంది. దీనికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ససేమిరా అంటూ..సుప్రీం తీర్పు వస్తే అమలు చేస్తామని..హైకోర్టు తీర్పు ప్రకారం నోటిఫికేషన్ జారీ చేస్తున్నామని తెలిపారు. సీఎస్,డీజీపీతోపాటు కలెక్టర్లు ఎవరూ కూడా సమావేశానికా రాకపోవటంతో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించటం లేదనే విషయాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేయటానికి రెడీ అయ్యారు. ఈ మేరకు అపాయింట్ మెంట్ కోరారు.

Next Story
Share it