Telugu Gateway
Andhra Pradesh

స‌త్వ‌ర‌మే వెయ్యి కోట్లు ఇవ్వండి

స‌త్వ‌ర‌మే వెయ్యి కోట్లు ఇవ్వండి
X

భారీ వ‌ర్షాలు వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌లం అయిన రాయ‌ల‌సీమ జిల్లాల‌తోపాటు నెల్లూరు జిల్లాను ఆదుకునేందుకు స‌త్వ‌ర‌మే వెయ్యి కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేయాలని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేర‌కు ఆయ‌న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, హోం మంత్రి అమిత్ షాల‌కు బుధ‌వారం నాడు లేఖ రాశారు. బారీ వర్షాల వ‌ల్ల క‌లిగిన నష్టం అపార‌మ‌న్నారు. తక్షణ సాయం కింద 1000 కోట్లు మంజూరు చేయాలని సీఎం కోరారు. దీంతోపాటు ఏపీలో వరద నష్టం అంచనాకు వెంట‌నే కేంద్ర బృందాన్ని పంపించాలని విజ్ఞప్తి చేశారు.

''నాలుగు జిల్లాల్లో అసాధారణ వర్షపాతం నమోదైంది. చాలాచోట్ల 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లిందని'' సీఎం వైఎస్‌ జగన్ త‌న లేఖలో పేర్కొన్నారు. ''తిరుపతి, తిరుమల, నెల్లూరు, మదనపల్లె, రాజంపేటలో భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునిగాయి. 196 మండలాలు నీటమునిగాయి. 324 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో రహదారులు, చెరువులు, కాల్వలు కోతకు గురయ్యాయి. చెరువులు గండ్లు పడడం వల్ల చాలా ప్రాంతాలు నీటమునిగాయని'' సీఎం జగన్‌ లేఖలో వెల్ల‌డించారు.

Next Story
Share it