Telugu Gateway
Andhra Pradesh

దేశంలో జగనే నెంబర్ వన్

దేశంలో జగనే నెంబర్ వన్
X

ఇది పరిపాలనలో కాదు...అభివృద్ధిలో కాదు. దేశంలోని మొత్తం ముప్పై మంది ముఖ్యమంత్రుల్లో అత్యధిక ఆస్తులు ఉన్న సీఎం గా వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిలిచారు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటి అంటే 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటేశ్వరులే. అసోసియేషన్ అఫ్ డెమాక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించిన వివరాల ప్రకారం సీఎం జగన్ ఆస్తులు 510 కోట్ల రూపాయలుగా తేల్చారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో కేవలం 15 లక్షల రూపాయల ఆస్తులతో మమతా బెనర్జీ ఉన్నారు. దేశం లోనే ధనిక సీఎం జగన్ అయితే...పేద సీఎం గా మమతా బెనర్జీ ఉన్నారు. జగన్ తర్వాత అత్యధిక ఆస్తులు ఉన్న వారి స్థానంలో అరుణాచల్ సీఎం పేమా ఖండూ . ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ ఉన్నారు. పేమా ఖండూ ఆస్తులు 163 కోట్ల రూపాయలు ఉంటే..ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆస్తులు 64 కోట్ల రూపాయలు ఉన్నాయి.

తెలంగాణ సీఎం కెసిఆర్ కు ఆస్తుల తో పాటు అప్పులు కూడా ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కెసిఆర్ కు మొత్తం 23 .5 కోట్ల రూపాయలు ఆస్తులు ఉంటే..8 .8 కోట్ల రూపాయల అప్పు ఉన్నట్లు చూపించారు. అత్యధిక అప్పులు ఉన్న సీఎంగా కెసిఆర్ ను ఈ నివేదికలో ప్రస్తావించారు. సీఎం కెసిఆర్ తర్వాత ఎక్కుడ అప్పులు ఉన్నది కర్ణాకటక సీఎం బసవరాజు బొమ్మై ఉన్నారు. అయన మొత్తం ఆస్తులు తొమ్మిది కోట్ల రూపాయలు ఉండగా. అప్పులు ఐదు కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. మహారాష్ట్ర సీఎం ఎకనాథ్ షిండే ఆస్తులు మొత్తం 11.6 కోట్ల రూపాయలు అయితే...అప్పులు 3 .75 కోట్ల రూపాయలు గా ఉన్నాయి.

Next Story
Share it