సీఎం జగన్ చేతికి బాలాపూర్ లడ్డూ
BY Admin21 Sept 2021 8:39 PM IST

X
Admin21 Sept 2021 8:39 PM IST
హైదరాబాద్ లో వినాయకచవితి అంటే ఖైరతాబాద్ వినాయకుడు..బాలాపూర్ లడ్డూ. ఈ రెండూ ఎంతో ఫేమస్. హైదరాబాద్ లో ఎన్ని వేల సంఖ్యలో వినాయకుడి విగ్రహాలు ఉన్నా ఖైరతాబాద్ వినాయకుడి ప్రత్యేకత ఏ మాత్రం తగ్గదు. అలాగే లడ్డూ విషయంలో బాలాపూర్ లడ్డూకే ప్రత్యేకత ఉంటుంది. బాలాపూర్ లడ్డూను ప్రతి ఏటా తరహాలోనే ఈ సారి కూడా వేలం నిర్వహించారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా బాలాపూర్‌లో నిర్వహించిన వేలంపాటలో ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, నాదర్‌గుల్ నివాసి అబాకస్ విద్యాసంస్ధల అధినేత మర్రి శశాంక్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అత్యధికంగా రూ.18.90 లక్షలకు వీరిద్దరూ లడ్డూను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ లడ్డూను వీరిద్దరూ మంగళవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందజేశారు.
Next Story