Telugu Gateway
Andhra Pradesh

పెండింగ్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ఏపీ, ఒడిశా సీఎంల భేటీ

పెండింగ్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ఏపీ, ఒడిశా సీఎంల భేటీ
X

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మంగ‌ళ‌వారం నాడు ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ తో స‌మావేశం అయ్యారు. వీరిద్ద‌రిలో భేటీలో ఎప్ప‌టి నుంచో పెండింగ్ లో ఉన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై చ‌ర్చ‌లు సాగించారు. రెండు రాష్ట్రాల మ‌ధ్య ప‌రిష్కారం కావాల్సిన అంశాల‌పై చ‌ర్చించేందుకు ఇరు రాష్ట్రాల సీఎస్ ల‌తో క‌మిటీ వేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు నిర్మాణం, కొఠియా గ్రామాల స‌మ‌స్య‌పై సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ భేటీలో నవీన్ పట్నాయక్‌తో చర్చించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర రైతుల కల సాకారం అయ్యే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.

ఒడిశా అభ్యంతరాలతో అనేక దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో చర్చించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్‌, ఇరిగేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్యామలరావు, రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఉషా రాణి భేటీలో పాల్గొన్నారు. ఒడిశా సీఎంతో భేటీ కోసం సీఎం జ‌గ‌న్ మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం భువ‌నేశ్వ‌ర్ చేరుకున్నారు. అక్క‌డ ఆయ‌న‌కు తెలుగు సంఘం ప్ర‌తినిధులు స‌మావేశం అయి కొఠియా గ్రామ‌స్తుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరారు.

Next Story
Share it