Telugu Gateway
Andhra Pradesh

అబద్దాలపై మాట్లాడి...గ్యాప్ లేకుండా అబద్దాలు చెప్పిన జగన్

అబద్దాలపై మాట్లాడి...గ్యాప్ లేకుండా అబద్దాలు చెప్పిన జగన్
X

రాజకీయ పార్టీలు అన్ని కూడా అబద్దాలు చెప్పటం తమ జన్మ హక్కుగా భావిస్తాయి. అబద్దాలు చెపితే తాము చెప్పాలి కానీ..ఇతర పార్టీల వాళ్ళు చెపితే ఎలా అన్న తరహాలో వ్యవహరిస్తుంటాయి. వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరు కూడా అచ్చం అలాగే ఉంది. అబద్దాల గురించి ఆంధ్ర ప్రదేశ్ లోని పార్టీలను విమర్శిస్తూ..ఆ వెంటనే ఏ మాత్రం గ్యాప్ లేకుండా సీఎం జగన్ చెప్పిన అబద్దాలను చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఎంతైనా అబద్దాలు చెప్పటం లో జగన్ ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. విపక్షాలు పదే పదే అదే అబద్దాన్ని అదే నిజం అని చెప్పి..నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయి అంటూ మండిపడ్డారు. ఆ వెంటనే అయన తనకు వాళ్ళలాగా పేపర్ లేదు...వాళ్ళ లాగా టీవీ లేదు..సోషల్ మీడియా లేదు అంటూ దీన్ని ఇప్పుడు కొత్త అబద్దంలో యాడ్ చేశారు. చూసే వాళ్ళు..వినేవాళ్ళు ఏమి అనుకుంటారు అనే బెరుకు ఏ మాత్రం లేకుండా జగన్ కూడా అవే అబద్దాలను పదే పదే చెప్పకుంటూ పోతున్నారు. కొత్తగా తనకు సోషల్ మీడియా లేదు అంటూ కూడా సెలవిచ్చారు. సోషల్ మీడియా అంటే రాసుకునే వాళ్లకు రాసుకున్నంత. దీన్ని ప్రజలకంటే పార్టీలే ఎక్కువగా..అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తున్నాయి. అయినా సరే జగన్ కు సోషల్ మీడియా కూడా లేదు అంట. బుధవారం నాడు శ్రీకాకుళం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తర్వాత జగన్ఈ మాటలన్నారు.

జగన్ వ్యాఖ్యలు అయన మాటల్లోనే....‘వీరిది ఒకే అబద్దాన్ని పదే పదే ..అదే అబద్దాన్ని పదే పదే చెప్పి అదే నిజం అని చెప్పి నమ్మించే ఒక చీకటి యుద్ధం ఈ రోజు రాష్ట్రం లో జారుతోంది. ఈ రోజు మీ బిడ్డకు ఇలాంటి పత్రికలు లేవు. మీ బిడ్డకు ఇలాంటి టీవీ లు లేవు. మీ బిడ్డకు ఇలాంటి సోషల్ మీడియా లేదు. పెత్తందారుల పక్షాన నిలబడ్డ టీడీపీ కి...పేదల పక్కన నిలబడ్డ మీ బిడ్డ కు మధ్య యుద్ధం జరుగుతోంది. వ్యవస్థలను మేనేజ్ చేయటాన్ని నమ్ముకున్న వారికి..ప్రజలనే నమ్ముకున్న మీ బిడ్డకు యుద్ధం జరుగుతుంది. ’ అంటూ మాట్లాడి ఆ వెంటనే తనకు టీవీ, పేపర్ లేవు అని ప్రకటించారు. అయితే ఈ సారి అందరు అబద్దాలు చెపుతున్నారు..తాను మాత్రమే నిజాలు చెపుతున్నట్లు మాట్లాడి ఈ విషయాలు చెప్పటం అనేది జగన్ మొత్తం స్పీచ్ లో హై లైట్ గా నిలిచింది అనే చెప్పాలి. ఏమి మంచి చేశామో చెప్పుకోలేని వాళ్ళు అంతా ఏకం అవుతున్నారు. మీ బిడ్డ ఒక వైపు ఉన్నాడు. మీ బిడ్డకు వ్యతిరేకంగా పలానా మంచి చేశాం అని ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోలేని వారు ఏకం అయి చీకటి యుద్ధం చేస్తున్నారు. వీరి చీకటి యుద్దాన్ని గమనించామని కోరుతున్నా అంటూ జగన్ ఈ సభలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాంతాలే కాదు...ప్రతి ఇల్లు బాగు పడాలని, డీబీటి నే కాదు...ప్రాంతాల చరిత్ర మార్చాలని చూస్తున్నట్లు వెల్లడించారు. తన నవరత్నాల పాలన తో సామాజిక వర్గాల, పారిశ్రామిక, వాణిజ్య వర్గాల చరిత్ర తిరగ రాస్తున్నా అంటూ జగన్ ప్రకటించారు.



Next Story
Share it