Telugu Gateway
Andhra Pradesh

నవరత్నాలకు తోడు 'జగనన్న తిట్టుడు స్కీం'

నవరత్నాలకు తోడు జగనన్న తిట్టుడు స్కీం
X

ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన తిట్టుడు వ్యాఖ్యాలు దుమారం రేపుతున్నాయి. ఇవి చూసి నవరత్నాల కు తోడు జగనన్న తిట్టుడు స్కీం ను కూడా కొత్తగా తెచ్చినట్లు ఉన్నారని అధికారులే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీనికి సంబందించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగళవారం నాడు సీఎం జగన్ వివిధ పధకాల కింద లబ్దిదారులకు 590 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పధకాలు అందాలన్నారు. ఏ మంచి పని చేసినా కొంతమంది వక్రీకరిస్తున్నారని...ఆరోపణల్లో నిజం ఉంటే సరిచేసుకుందాం...లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా తిట్టండి అని కలెక్టర్లకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు.ఖచ్ఛితంగా బయటకు వచ్చి ..ఖచ్చితంగా వాళ్ళను తిట్టే కార్యక్రమం కూడా చేయమని ప్రతి కలెక్టర్ ను కోరుతున్నా . .ఎందుకని అంటే ఆలా తిట్టక పోతే అది రాంగ్ మెసేజ్ కూడా పోతుంది. వాళ్ళు చెప్పేది నిజం ఏమో అన్న సందేహం కూడా ఉంటుంది. కలెక్టర్ అది కూడా గుర్తు పెట్టుకోవాలి.

తిట్టేటప్పుడు ఖచ్ఛితంగా మనది తప్పు లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గట్టిగా తిట్టండి. సో దట్ వాళ్ళు చేసిన తప్పు వాళ్లకు ఎత్తి చూపినట్లు అవుతుంది అంటూ సంచలన వ్యాఖ్యాలు చేశారు. ప్రభుత్వంలోకి వచ్చిన కొత్తలో తప్పుడు వార్తలు రాస్తే కేసులు పెడతామని మీడియాను బెదిరిస్తూ జీఓ తెచ్చారు. ఇప్పుడు అది వదిలేసి తిట్టాలని స్వయంగా ముఖ్యమంత్రి కలెక్టర్లకు చెప్పటం చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఏ మీడియా తప్పుడు వార్త రాసినా సహజంగా అధికారులు వివరణ ఇస్తారు...అది మరి దారుణమైన విషయం అయితే కేసు కూడా పెడతారు. ఇప్పుడు అదేమీ లేకుండా సీఎం స్వయంగా తిట్టాలని కలెక్టర్లను పురమాయించటం అంటే ఇది పరిపాలనలో ఒక కొత్త అధ్యాయంగా నిలుస్తోంది అంటున్నారు అధికారులు. మరి సీఎం జగన్ చెప్పినట్లు అధికారులు మీడియాను గట్టిగా తిడతారా..అది సాధ్యం అవుతుందా...చూడాలి...ఆంధ్ర ప్రదేశ్ లో చాలా చాలా జరుగుతున్నాయి కాబట్టి ఏదైనా జరగొచ్చు.

Next Story
Share it