Telugu Gateway
Andhra Pradesh

ఢిల్లీకి ఏపీ సీఎం జ‌గ‌న్

ఢిల్లీకి ఏపీ సీఎం జ‌గ‌న్
X

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఖ‌రారైంది. ఆయ‌న సోమ‌వారం ఢిల్లీ బ‌య‌లుదేరి వెళ్ళ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో జ‌గ‌న్ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇత‌ర కేంద్ర మంత్రుల‌ను కూడా క‌లిసే అవ‌కాశం ఉంది. రేపు సాయంత్రంం నాలుగు గంటల ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. ఎప్ప‌టి నుంచో పెండింగ్ లో ఉన్న పోల‌వ‌రం నిధుల అంశంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై జ‌గ‌న్ ప్ర‌ధానితో భేటీ సంద‌ర్భంగా చ‌ర్చించే అవ‌కాశం ఉంది. విభ‌జ‌న హామీల అంశాన్ని కూడా జ‌గ‌న్ మ‌రోసారి లేవనెత్తే అవ‌కాశం ఉంది. రాష్ట్రం పెద్ద ఎత్తున ఆర్ధిక స‌మ‌స్య‌ల్లో చిక్కుకుపోయినందున కేంద్రం నుంచి అద‌న‌పు సాయం కోరే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

Next Story
Share it