ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్
BY Admin9 Jun 2021 9:17 PM IST
X
Admin9 Jun 2021 9:17 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు అయింది. ఆయన గురువారం ఉదయం పది గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. వాస్తవానికి కొద్ది రోజుల క్రితమే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నా అపాయింట్ మెంట్స్ ఖరారు కాకపోవటంతో ఆగిపోయారు. సీఎం జగన్ రేపటి ఢిల్లీ పర్యటనలో భాగంగా హోం మంత్రి అమిత్‌షా, జలవనరుల శాఖమంత్రి గజేంద్ర సింగ్‌షెకావత్ సహా పలువురు కేంద్రమంత్రులను జగన్ కలుసుకుంటారు. పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారితో చర్చిస్తారని తెలిపారు.
Next Story