జగన్ డిసైడ్ అయ్యారంట!
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఓ సారి రాజధానిపై నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చిన ప్రభుత్వం మూడు రాజధానులు అనటం సరికాదని..పార్లమెంట్ లో మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది. హైకోర్టు తీర్పు తర్వాత కూడా వైసీపీ సర్కారు తాము పరిపాలనా వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నామని..వైజాగ్ లోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుందని మంత్రులు పలుమార్లు ప్రకటించారు. ఈ తరుణంలో జగన్ వచ్చే ఏప్రిల్ నుంచి వైజాగ్ కు షిఫ్ట్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లోగా మరోసారి ఏమైనా బిల్లులు తెచ్చే ప్రయత్నం చేస్తారా..కేంద్రంతో మాట్లాడి చట్టంలో మార్పులు చేయించుతారా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో వైసీపీ మూడు రాజధానుల నినాదంతో..టీడీపీ ఒకే రాజధాని గా అమరావతి నినాదంతో ముందుకు సాగే అవకాశం కన్పిస్తోంది. వైసీపీ ఒక్కటే మూడు రాజధానుల గురించి మాట్లాడుతుంటే టీడీపీ, బిజెపి, జనసేనలు మాత్రం అమరావతే రాజధాని నినాదంతో ఉన్నాయి. మరి అంతిమంగా ఎన్నికలలోపు ఏమి తేలుతుందో వేచిచూడాల్సిందే.