Telugu Gateway
Andhra Pradesh

సీఎం జగన్ గందరగోళ ప్రకటనలు

సీఎం జగన్ గందరగోళ ప్రకటనలు
X

వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గత కొన్ని నెలలుగా ఒకటే మాట చెపుతున్నారు. అది ఏంటి అనే 175 కు 175 సీట్లు సాధిస్తాం. 151 సీట్లు సాధించిన తమకు ఇది ఎందుకు సాధ్యం కాదు అని ప్రతి పార్టీ మీటింగ్ లో ఉదరగొడుతున్న విషయం తెలిసిందే. మళ్ళీ ఆయనే కొంత మంది ఎమ్మెల్యే ల పనితీరు ఏ మాత్రం బాగా లేదు అని ప్రకటించినట్లు పార్టీ సమావేశాల సందర్భంగా నివేదికలు బయటకు వెల్లడిస్తారు. అలాంటి అప్పుడు మరి 175 కు 175 సీట్లు ఎలా వస్తాయి అంటే సమాధానం దొరకటం కష్టమే. మహా మహా నాయకులు ఉన్న రోజుల్లో కూడా ఎప్పుడూ ఒక రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ సీట్లు అన్ని ఒకే పార్టీకు వచ్చిన చరిత్ర లేదు అనే చెప్పొచ్చు. మరి ఎన్నో వ్యతిరేకతలు ఉన్న సీఎం జగన్ కు అది అసలు జరగదు అంటే జరగదు అని చెప్పొచ్చు. మంగళవారం నాడు వైసీపీ అధినేత జగన్ తెనాలి లో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా రివర్స్ అయ్యాయనే చర్చ సాగుతోంది. ఒక వైపు అయన ఎప్పటినుంచో తమకు 175 సీట్లు వస్తాయని చెప్పుకుంటూ...ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ను 175 కు 175 సీట్ల లో పోటీచేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు.

మరి అయన చెప్పినట్లు వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లు గెలిచేటట్లు అయితే ఎవరు ఎన్ని సీట్ల లో పోటీ చేస్తే జగన్ కు వచ్చే నష్టం ఏమిటి. అంటే టీడీపీ, జనసేన కలిసి నడిస్తే వైసీపీ కి రాజకీయంగా ఇబ్బందులు తప్పవు అనే విషయాన్ని అయన చెప్పకనే చెప్పారనే అభిప్రాయం వ్యక్తం అవుతుతోంది. సీఎం జగన్ తీరు చూస్తే జనసేన ను ఎంత వీలు అయితే అంత రెచ్చ గొట్టాలి ..పొత్తును చెడగొట్టాలి అనే టార్గెట్ తో పనిచేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ మంత్రులు...ఎమ్మెల్యేలు ఎప్పటినుంచో అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు నేరుగా సీఎం జగన్ చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు 175 కు 175 సీట్లలో పోటీ చేసే దమ్ము ఉందా అంటూ సవాల్ విసిరారు. తెనాలి మీటింగ్ లో కూడా జగన్ ఎప్పటి లాగానే అదే క్యాసెట్ వేశారు. దుష్ట చతుష్టయం..దోచుకున్నారు అంటూ చంద్రబాబు పై విమర్శలు చేశారు. మరి ఈ జగన్ ప్లాన్స్ ఏ మేరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.

Next Story
Share it