పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా?:జగన్
రాసి ఇస్తే తప్ప రాజకీయ విమర్శలు కూడా చేయలేరు ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్. ఇది ఎన్నో బహిరంగ సభల్లో స్పష్టంగా కనిపించింది. చాలా వరకు చూసి చదవటమే అయన చేసే పని. అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయటనికి కూడా ప్రత్యేక నోట్స్ తో వస్తుంటారు. ఇది తప్పుకాకపోయినా నాయకుడి సత్తాను మాత్రం ఇది తెలియచేస్తుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. తాజగా ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మరో సారి ట్రోలర్స్ కు చిక్కారు. అంతే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.అదేంటి అంటే మిగ్ జాం తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్ ప్రభుత్వం తరపున బాధితులకు అందిస్తున్న సాయం గురించి చెప్పారు.
అదే సమయంలో వేదికపై ఉన్న వాళ్ళను సీఎం జగన్ పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా అని ప్రశ్నిస్తారు. అయితే జగన్ ఉన్న సభలో కింద కూర్చున్న వాళ్ళతో పాటు వేదికపై ఉన్న వాళ్ళు కూడా పొటాటో అంటూ బంగాళాదుంప అంటూ చెప్పటం వీడియోలో కనిపిస్తుంది. అంతే ఈ వీడియో కు ఇప్పుడు ట్రోలర్స్ బ్రహ్మనందం, బాబు మోహన్ డైలాగులు జోడించి మరీ వైరల్ చేస్తున్నారు. ఎప్పటిలాగానే అధికారులను ఏమి ఇస్తున్నామో రాసివ్వమంటే ఇస్తారు కదా..ఇలా అందరిలో పరువు తీసుకోవటం ఎందుకు అని ఒక వైసీపీ నేతే వ్యాఖ్యానించారు.