ఈ సారి లెక్క తప్పదు
శనివారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి లో రాజధాని పనుల పునః ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. సిఆర్డీఏ ఆఫీస్ పనులకు తిరిగి ప్రారంభించారు. రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది అనే అమరావతిని రాజధానికి ఎంపిక చేశాం అని..వైజాగ్ ను ఆర్దికగా రాజధానిగా చేస్తామన్నారు. కర్నూల్ లో హై కోర్ట్ బెంచ్ తో పాటు పరిశ్రమలతో ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. కొత్తగా చేపట్టే పనులకు టెండర్లు పిలిచి డిసెంబర్ నుంచి రాజధాని పనుల వేగాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాజధాని అమరావతి పనులను మూడేళ్ళలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ఫస్ట్ టర్మ్ లో చేసినట్లు కాకుండా ఈ సారి రాజధాని పనులు పూర్తి చేయటం రాజకీయంగా కూడా టీడీపీ కి ఎంతో కీలకం. ఈ సారి కేంద్రం అండదండలు ఉండటంతో రాజధాని పక్కాగా పూర్తి అవుతుంది అనే ధీమా అందరిలో ఉంది. ఇప్పుడు ఏ రాజధాని పనులను అనుకున్న ప్రకారం పూర్తి చేయించాల్సిన బాధ్యత చంద్రబాబుదే.