ఏపీ బడ్జెట్ 2,56,256 కోట్ల రూపాయలు
ఏపీ సర్కారు కూడా భారీ బడ్జెట్ ను శాసనసభ ముందు ఉంచింది. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శుక్రవారం నాడు శాసనసభలో కొత్త పద్దును వెల్లడించారు. 2022-23 వార్షిక బడ్జెట్ 2,56,256 కోట్ల రూపాయలు గా తెలిపారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2, 08, 261 కోట్ల రూపాయలు, మూల ధన వ్యయం 47, 996 కోట్ల రూపాయలు, రెవెన్యూ లోటు . 17, 036 కోట్ల రూపాయలుగా తెలిపారు. ద్రవ్య లోటు రూ. 48, 724 కోట్లు, జీఎస్డీపీ రెవెన్యూ లోటు 1.27 శాతంగా బడ్జెట్‌లో పొందుపర్చారు. ఈ బడ్జెట్ కింద వివిధ పద్దుల కింద చేసిన కేటాయింపులు ఇలా ఉన్నాయి.
2022-23 ఏపీ వార్షిక బడ్జెట్ రూ.2,56,256 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు
మూలధన వ్యయం రూ.47,996 కోట్లు
రెవెన్యూ లోటు రూ.17,036 కోట్లు
ద్రవ్య లోటు రూ.48,724 కోట్లు
జీఎస్డీపీ రెవెన్యూ లోటు 1.27 శాతం
వైఎస్సార్ పెన్షన్ కానుక రూ.18వేల కోట్లు
వైఎస్సార్ రైతు భరోసా రూ.3,900 కోట్లు
జగనన్న విద్యాదీవెనకు రూ.2400 కోట్లు
జగనన్న వసతిదీవెనకు రూ.2,083 కోట్లు
వైఎస్సార్ పీఎం ఫసల్ భీమా యోజన రూ.1.802 కోట్లు
ఈబీసీ నేస్తం రూ.590 కోట్లు
వైఎస్సార్ ఆసరా కోసం రూ.6400 కోట్లు
వైఎస్సార్ చేయూతకు రూ.4,235.95 కోట్లు
జగనన్న అమ్మ ఒడికి రూ.6500 కోట్లు
కాపు నేస్తం పథకానికి రూ.500 కోట్లు
వైఎస్సార్ జగనన్న చేదోడు రూ.300 కోట్లు
వైఎస్సార్ వాహన మిత్ర రూ.260 కోట్లు
వైఎస్సార్ నేతన్న నేస్తం రూ.199.99 కోట్లు
వైఎస్సార్ మత్స్యకార భరోసా రూ.120.49 కోట్లు
ఆర్థిక సేవల రంగానికి రూ.69,306 కోట్లు కేటాయింపు
వ్యవసాయం రూ.11,387.69 కోట్లు
పశుసంవర్ధకం రూ.1,568.83 కోట్లు
బీసీ సంక్షేమం రూ.20,962.06
విద్యుత్ రూ.10,281.04 కోట్లు
సెకండరీ ఎడ్యుకేషన్ రూ.27,706.66 కోట్లు
ఇరిగేషన్ ఫ్లడ్ కంట్రోల్ రూ.11,482 కోట్లు
గ్రామీణాభివృద్ధి రూ.17,109 కోట్లు
సైన్స్ అండ్ టెక్నాలజీ రూ.685 కోట్లు
ట్రాన్స్‌పోర్ట్ రూ.9,617 కోట్లు కేటాయింపు
పర్యావరణ, అటవీ రూ.685.36 కోట్లు
ఉన్నత విద్య రూ.2,014.30 కోట్లు
పౌరసరఫరాలు రూ.3,719.24 కోట్లు
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రూ.10,201.60 కోట్లు
ఎస్సీ సబ్ ప్లాన్ రూ.18,518 కోట్లు
ఎస్టీ సబ్ ప్లాన్ రూ.6,145 కోట్లు
బీసీ సబ్ ప్లాన్ రూ.29,143 కోట్లు
మైనార్టీ యాక్షన్ ప్లాన్ రూ.3,532 కోట్లు
ఈబీసీల సంక్షేమం రూ.6,639 కోట్లు కేటాయింపు
వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,630 కోట్లు
రవాణా శాఖకు రూ.9,617 కోట్లు
పరిశ్రమలు, ఖనిజాభివృద్ధికి రూ.2,755 కోట్లు
సాగునీరు, వరద నివారణలకు రూ.11,482 కోట్లు
శాస్త్ర సాంకేతికతకు, పర్యావరణానికి రూ.11.78 కోట్లు
వైద్య రంగానికి రూ.15,384 కోట్లు
సాధారణ విద్యకు రూ.30,077 కోట్లు
కళలు, సంస్కృతుల కోసం రూ.20.67కోట్లు
హౌసింగ్‌కు రూ.4,791 కోట్లు
కార్మిక, ఉపాధికి రూ.1,033 కోట్లు
సామాజిక భద్రత, సంక్షేమానికి రూ.4,331 కోట్లు
క్రీడలు, యువజన సర్వీసులకు రూ.140 కోట్లు
సాంకేతిక విద్యకు రూ.413 కోట్లు
పట్టణాభివృద్ధికి రూ.8,796 కోట్లు
తాగునీరు పారిశుధ్యానికి రూ.2,133 కోట్లు
సంక్షేమ పథకాలకు రూ.45,955 కోట్లు
సాధారణ సర్వీసులకు రూ.73,609 కోట్లు కేటాయింపు
ఏపీ స్టేట్ క్రిష్టియన్ కార్పొరేషన్ రూ.113 కోట్లు
రెడ్డీ వెల్ఫేర్ కార్పొరేషన్ రూ.3,088 కోట్లు
కమ్మ వెల్ఫేర్ కార్పొరేషన్ రూ.1,899 కోట్లు
ఫైనాన్స్ రూ.58,538 కోట్లు
జీఏడీ రూ.998 కోట్లు
సచివాలయ వ్యవస్థ రూ.3,396 కోట్లు
సోషల్ వెల్ఫేర్ రూ.12,728 కోట్లు
రోడ్లు, భవనాల శాఖ రూ.8,581 కోట్లు
క్రీడా శాఖ రూ.290 కోట్లు
హోంశాఖ రూ.7,586 కోట్లు
కార్మిక శాఖకు రూ.790 కోట్లు
న్యాయశాఖ రూ.924 కోట్లు
మున్సిపల్ శాఖ రూ.8,796 కోట్లు
మైనార్టీ శాఖ రూ.2,063 కోట్లు
ఐటీ శాఖకు రూ.212 కోట్లు
రెవెన్యూ శాఖ రూ.5,306 కోట్లు
మౌళిక వసతులు రూ.1,142 కోట్లు
శాసన వ్యవస్థ రూ.107 కోట్లు
నేషనల్ హెల్త్ మిషన్ రూ.2,462 కోట్లు
మెడికల్ కాలేజీలలో పనులకు రూ.753 కోట్లు
వైఎస్సార్ ఆరోగ్య అసరా రూ.300 కోట్లు
ట్రైబల్ ఏరియాలో ఆస్పత్రుల కోసం రూ.170 కోట్లు
108 అంబులెన్స్‌ల కోసం రూ.133.19 కోట్లు
104 సర్వీసులకు రూ.140 కోట్లు
రేషన్ బియ్యం కోసం రూ.3,100 కోట్లు
బియ్యం డోర్ డెలివరీ కోసం రూ.200 కోట్లు
వార్డు వాలంటీర్లకు రూ.3,396 కోట్లు