Telugu Gateway
Andhra Pradesh

ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ కి అధిష్టానం చికిత్స

ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ కి అధిష్టానం చికిత్స
X

ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ లో కీలక పరిణామం. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు ను ఆ పదవి నుంచి తప్పించారు. తాజాగా బీజేపీ జాతీయ నేతలు ఆంధ్ర ప్రదేశ్ లోని జగన్ సర్కారుపై నేరుగా తీవ్ర విమర్శలు చేసిన తరుణంలో ఈ మార్పు చోటు చేసుకోవటం కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. సోము వీర్రాజు ఆంధ్ర ప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. కొంత మంది బీజేపీ నేతలే ఈ విషయాన్నీ బహిరంగంగా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ పార్టీ ప్రెసిడెంట్ జె పీ నడ్డా లు గతానికి బిన్నంగా జగన్ సర్కారుపై ఎటాక్ చేశారు. అయితే ఇది అంతా కేవలం ఒక డ్రామా అనే విమర్శలు కూడా వచ్చాయి.

అయితే ఇప్పుడు అనూహ్యంగా ఎన్నికల ముందు రాష్ట్ర అధ్యక్షుడిని మార్చటం అన్నది కీలకంగా చెప్పుకోవచ్చు. మంగళవారం నాడు నడ్డా ఫోన్ చేసి మరి సోము వీర్రాజు కు మార్పు విషయం తెలిపారు. ఈ విషయాన్నీ అయన కూడా నిర్దారించారు. అయితే సోము వీరాజు ప్లేస్ లో ఎవరు వస్తారు అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే బీజేపీ నేత సత్య కుమార్ పేరు మాత్రం గట్టిగా వినిపిస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన రాబోతుంది. సోము వీర్రాజు మార్పుతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ , టీడీపీ, జనసేన లు కలిసి పోటీ చేసే అవకాశలు మరింత మెరుగు అయ్యే అవకాశం ఉంది అనే చర్చ సాగుతోంది. చూడాలి ఈ మార్పుల తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో.

Next Story
Share it