Telugu Gateway
Andhra Pradesh

పోలవరం చర్చ..టీడీపీ సభ్యుల సస్పెన్షన్

పోలవరం చర్చ..టీడీపీ సభ్యుల సస్పెన్షన్
X

పోలవరం ప్రాజెక్టు అంశం బుధవారం నాడు శాసనసభలో దుమారం రేగింది. అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నాయి. వైసీపీ ప్రభుత్వం చేతకానితనంతోనే పోలవరం ప్రాజెక్టు వివాదంలో చిక్కుకుందని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు విమర్శించారు. కేసుల భయంతోనే నిధుల విషయంలో కేంద్రాన్ని జగన్ గట్టిగా అడగలేకతున్నారని విమర్శించారు. పోలవరం పూర్తి చేయటం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అన్నారు. వైసీపీ మాటలు విని ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను ఇస్తే ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. పోలవరం భూసేకరణ పూర్తి చేసి ఆర్ అండ్ ఆర్ ఇవ్వాలన్నారు. ఈ విషయంలో కేంద్రాన్ని ఒప్పించి నిదులు తేలేకపోతే మాత్రం చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు. ఎన్నికల్లో గెలిస్తే పోరాడి సాధిస్తామని చెప్పిన వారు ..ఇప్పుడు నాటకాలు ఆడొద్దని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబుతోపాటు టీడీపీ విమర్శలను ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తోసిపుచ్చారు. ఎవరు పోలవరం ప్రాజెక్టు వివాదస్పంద చేస్తున్నారని ప్రశ్నించారు. మీరు, మీ మాజీ మంత్రే కదా ఎత్తు తగ్గిస్తున్నారని దుష్ప్రచారం చేసింది..చేస్తున్నది అని ఫైర్ అయ్యారు.

తాము ముందు చెప్పినట్లు 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు పోడియం వద్దకు పోయి నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల తీరుపై జగన్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ వాదన బయటకు పోకూడదనే ఎప్పటిలాగానే టీడీపీ చేస్తుందని..సస్పెండ్ చేసి బయటకు పంపాలని..తీర్మానం పెట్టాలని కోరతారు. ఆ వెంటనే తీర్మానం ప్రవేశపెట్టి ఏపీ అసెంబ్లీ నుంచి 9 మంది టీడీపీ సభ్యులను సభనుం చి సస్పెండ్ చేశారు. దీంతో వరుసగా మూడో రోజు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ వేటుకు గురయ్యారు. సీఎం జగన్ ప్రసంగానికి అడ్డుపడటంతో తొమ్మిది మంది సభ్యులను సస్పెండ్ చేశారు. సస్పెండ్‌ అయిన వారిలో అచ్చెన్నాయుడు, రామానాయుడు, రవికుమార్‌, బాల వీరాంజనేయస్వామి, జోగేశ్వరరావు, రామకృష్ణబాబు, అశోక్‌, అనగాని సత్యప్రసాద్‌, ఏలూరి సాంబశివరావు ఉన్నారు.

Next Story
Share it